Friday, May 17, 2024

కోమటి రెడ్డికి అంత అహంకారం పనికి రాదు

spot_img

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అధికారమదంతో ఆటవికంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి.భువనగిరి జడ్పీచైర్మన్ సందీప్ రెడ్డి పై జరిగిన దాడి ఆయన ఆటవిక ప్రవర్తనకు తార్కాణమన్నారు. దాడి ఘటనపై ఆయన ఇవాళ( సోమవారం) మీడియా సమావేశం నిర్వహించారు. రక్షించాల్సిన పోలీసులు సందీప్ రెడ్డిని నెట్టేయ్యడం దారుణమన్నారు.

అత్యుత్సాహం ప్రదర్శించిన రాచకొండ పోలీసులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. మంత్రి హోదాలో ఇంతటి ఆటవికంగా ప్రవర్తించండం దుర్మార్గపు చర్య అని విమర్శించారు. అంతటి అహంకారం ప్రజాక్షేత్రంలో పనికి రాదన్నారు. మంత్రి హోదాలో బుద్ధిగా ఉంటారని జిల్లా ప్రజలు ఆశించారన్నారు. జిల్లా ప్రజలు చైతన్యంతో ఆలోచన చేస్తారన్నారు. ఆయన చేసిన దీక్ష తెలంగాణ కోసం కాదన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తొలగిస్తారనే పదవికి రాజీనామా చేశాడని.. ఊడిపోయే పదవికి త్యాగాల ట్యాగ్ వేసుకుని ఊరేగుతున్నాడని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వైఎస్ బూట్లు నాకిండన్నారు.

రేవంత్ రెడ్డి బెడ్రూంలో కాళ్లు పట్టుకొని మంత్రి పదవి తెచ్చుకున్నాడన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌ల గురించి మాట్లాడే నైతికత ఆయనకు లేదన్నారు. దివంగత మంత్రి మాధవరెడ్డి అనుచరులకు సిగరెట్లు మోసి బతికిన చరిత్ర ఆయనదన్నారు. 20 ఏండ్ల పాలనలో జిల్లాకు ఆయన ఒరగబెట్టింది ఏమీ లేదని, హామీల అమలుకు ప్రజలు నిలదిస్తుంటే అసహనంతోటే విపక్షాల మీద దాడులు చేస్తున్నారన్నారు. చెప్పుతో కొట్టండి అన్న నోరే చేతులతో నెట్టేదాకా చేరిందన్నారు. వ్యక్తిగతంగా మాట్లాడితే జిల్లాలో తిరగలేవన్నారు. కోమటిరెడ్డి చరిత్ర చాలా ఉందని.. సందర్భానుసారాంగ బయట పెడతామంటూ జగదీశ్‌రెడ్డి తేల్చి చెప్పారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ ప్రజల దళం, బలం, గళం ఎప్పటికీ బీఆర్‌ఎస్సే

Latest News

More Articles