Friday, May 3, 2024

తనపై తప్పుడు ప్రచారాన్ని ఖండించిన శాసనమండలి చైర్మన్

spot_img

హైదరాబాద్: ఈ నెల 25వ తేది నుండి గొంతు నొప్పి, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు చైర్మన్, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో ఆ రోజు నుండి ఎలాంటి కార్యక్రమాలలో పాల్గొనకుండా చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. అనారోగ్యం కారణంగానే గణతంత్ర దినోత్సవం సందర్భంగా 26 వ తేదీ సాయంత్రం గవర్నర్ ఇచ్చిన “ఎట్ హోం” కార్యక్రమానికి కూడా వెళ్ళలేదన్నారు. అదే విధంగా ముంబాయిలో ఈ నెల 27, 28 మరియు 29 తేదీలలో జరుగుతున్న అల్  ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ కూడా వెళ్ళలేదన్నారు.

శాసన సభ్యుల కోటాలో ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ 26వ గణతంత్ర దినోత్సవం రోజున శాసన మండలి కార్యాలయంలో తనను కలిసి ప్రమాణ స్వీకారానికి సమయం ఇవ్వాలని కోరారు. ఈ నెల 31వ తేది మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రమాణస్వీకారానికి సమయం ఇవ్వాలని కోరారు.  దానికి అంగీకరించాను. వీలైతే అదే రోజు మిగతా ఎమ్మెల్సీలతో కూడా ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కానీ, సోమవారం కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన కోదండ రాం ఇతర సభ్యులు తనకు  సమాచారం ఇవ్వకుండా కార్యాలయానికి వచ్చారన్నారు. ఇది తెలియని కొందరు మీడియాతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని తెలిపారు. శాసన మండలి ఛైర్మన్ గా నిష్పక్షపాతంగా తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు.

Also Read.. కేసీఆర్‌ను పోగొట్టుకున్నామని.. రైతులు బాధపడుతున్నారు

Latest News

More Articles