Sunday, May 5, 2024

కేసీఆర్‌ను పోగొట్టుకున్నామని.. రైతులు బాధపడుతున్నారు

spot_img

పరిగి: ప్రజలు మనకు 39 సీట్లు ఇచ్చి బలమైన ప్రతిపక్షంగా ఉండమన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు ప్రజలు. ఎన్నికలకు ముందు ఏమి జరిగింది అనేది కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. మన కారు సర్వీసింగ్ కు మాత్రమే పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పరిగి నియోజక వర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపి రంజిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also Read.. నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలి.. జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో చర్చ జరుగుతుందని, మార్పు మార్పు అంటే ఏమి జరిగింది అని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ ను పోగొట్టుకున్నాము అని రైతులు బాధపడుతున్నారని పేర్కొన్నారు. డిసెంబర్ 9న రెండు లక్షల రుణ మాఫీ చేస్తారు అన్నారు. మరి చేశారా? అని ప్రశ్నించారు. రైతులు రైతు బంధు మెసేజ్ ల కోసం రోజు ఫోన్ వైపు చూసారని తెలిపారు. రైతు భరోసా అమలు చేస్తున్నా అని దావొస్ లో పచ్చి అబద్ధాలు ఆడారని మండిపడ్డారు.

Also Read.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్‌దే విజయం

420 హామీలను కాంగ్రెస్ ఇచ్చింది. ఆరు గ్యారెంటీ లను వారం రోజుల్లో అమలు చేస్తామని అన్నారు. బస్సులలో ఏమి జరుగుతుందో మనందరికీ తెలుసు. మార్పు రాలేదు ఏమార్పు వచ్చింది అని అటో డ్రైవర్లు అంటున్నారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని కేసీఆర్ చెబితే అలాగే చేసాము. కాంగ్రెస్ కార్యకర్త కంటే కూడా అధ్వాన్నంగా గవర్నర్ మాట్లాడారు. అందుకే వారికి ధీటుగా మాట్లాడాము. కేసీఆర్ పంపిన ముగ్గురు సైనికులు మాట్లాడితేనే ఇట్లుంటే మా కమాండర్ కేసీఆర్ వస్తే ఎలా ఉంటది. కొర్రీలు పెట్టి గృహలక్ష్మి పథకాన్ని ఇవ్వము అంటే నిలదీసి అడగాలని సూచించారు.

Also Read.. జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిని అవమానించిన మంత్రి కోమటిరెడ్డి..బచ్చా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

రైతు బంధు పడలేదు అంటే చెప్పుతో కొట్టాలి అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రుణాలు వసూలు చేయండి అని మంత్రి తుమ్మల అన్నారు. బిజెపి నాయకులను ఓడించింది బిఆర్ఎస్. కవితను అరెస్టు చేయలేదు అందుకే బిజెపి, బిఆర్ఎస్ ఒక్కటే అన్నారు. కానీ కవిత సుప్రీంకోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్నరు. అదానీ దొంగ అని రాహుల్ అంటరు…కానీ రేవంత్ అదానీని హత్తుకుంటారు. 12 లక్షల చెట్లు కొట్టి రాడార్ స్టేషన్ తెస్తారట…ప్రశ్నించే గొంతులు ఎటుపొయాయి. మూసి, ఈసా మాయమవుతాయి. దీనిపై బహిరంగ చర్చ పెట్టి అన్ని విషయాలు చెప్పాలని దిశానిర్దేశం చేశారు. కరెంటు కోతలు మొదలు అయ్యాయి.  ఎరువుల కోసం లైన్ లు కట్టాల్సిన పరిస్థితి. బలమైన, తెలివైన ప్రతిపక్షం ఉంటే అధికారంలో ఉన్నదానికంటే ఎక్కువ పనులు అవుతాయన్నారు.

Also Read.. సందీప్ రెడ్డిపై దౌర్జన్యం.. కాంగ్రెస్ పార్టీ అహంకారానికి నిదర్శనం

Latest News

More Articles