Saturday, May 18, 2024

బీఆర్ఎస్ అనేది పార్టీ కాదు ఒక కుటుంబం

spot_img

బీఆర్ఎస్ పార్టీ కాదు ఒక కుటుంబమన్నారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. కార్యకర్తలు, నాయకులు లేనిదే పార్టీ లేదన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్ లో బీఅర్ ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం లో పాల్గొన్నారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఆ తర్వాత మాట్లాడిన ఆయన..తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర నాయకత్వం ..తెలంగాణ ఉద్యోగాలను, సంపదను దోచుకుపోతుంటే ఆ రోజున గులాబీ కండువా వేసుకొని బయలు దేరింది కేసీఆర్ ఒక్కరే.ఎన్ని కష్టాలు వచ్చిన కేసీఆర్ వెనకడుగు వేయలేదు, ధర్మం తప్పలేదు, పోరాటం వీడలేదు. అలుపెరగని పోరాటం చేసింది కేసీఆర్ . తెచ్చిన తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 గా అభివృద్ధి చేసింది కేసీఆర్. ఈ 10 ఏండ్లలో అనేక అభివృద్ధి, సంక్షేమ పనులను చేసిన ప్రజలు మనకు స్పీడ్ బ్రేకర్ వేశారన్నారు.

తెలంగాణ అభివృద్ధి చేసే క్రమంలో మన కార్యకర్తలను, నాయకులను పట్టించుకోలేదని తెలిపారు ప్రశాంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో అనేక పొరపాట్లు జరిగాయన్నారు. బీఆర్ఎస్ పార్టీని ఇంకా పటిష్టం చేసుకోవాలన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య 1.8 శాతం మాత్రమే ఓట్ల తేడా ఉందన్నారు. ప్రగతి భవన్ లో 100 బెడ్ రూంలు ఉన్నాయని, ఇనుప కంచెలు అంటూ అబద్ధాలను కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసిందని ఆరోపించారు. ప్రజావాణి అంటూ ఒక్క రోజు ప్రజల నుండి దరఖాస్తులు తీసుకొని హడావిడి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. ఈ 50 రోజుల కాంగ్రెస్ పాలనలో 14 వేల కోట్ల అప్పులు చేశారని తెలిపారు.

డిసెంబర్ 9న రెండు లక్షల రుణమాఫీ అన్న సీఎం రేవంత్ హామీ ఏమైందన్నారు ప్రశాంత్ రెడ్డి. అబద్ధాలు, ఆచరణ సాధ్యం కాని మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ పార్టీ నేతలు మోసం చేశారన్నారు. రైతు బంధు ఏది అని ఓ రైతు అడిగితే చెప్పుతో కొడతా అంటాడు మంత్రి కోమటి రెడ్డి, ఇందుకా కోమటి రెడ్డి నీకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది అని ప్రశ్నించారు. లోక్ సభ ఎన్నికల లోపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు,ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందన్నారు.ఎంపీ ఎన్నికల్లో కార్యకర్తలు గట్టిగా కొట్లాడి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయ్యాలని సూచించారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి.

ఇది కూడా చదవండి: అమరవీరుల స్థూపానికి సీఎం రేవంత్ నివాళులు అర్పించక పోవడం దారుణం

Latest News

More Articles