Monday, May 13, 2024

మెదక్ అభ్యర్థి ఎవరైనా.. గెలుపు బీఆర్ఎస్‌దే

spot_img

 హైదరాబాద్: కాంగ్రెస్ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి ,ఎమ్మెల్యే సునీత లక్ష్మా రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అడుగడుగునా ప్రొటో కాల్ సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులు అధికారిక కార్యక్రమాల్లో తమపైన పెత్తనం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష అనంతరం మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు.

Also Read.. ఆభరణాల కోసమే ఇద్దరు మహిళల హత్యలు.. కేసులను ఛేదించిన పోలీసులు

మెదక్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో మంచి చర్చ జరిగిందన్నారు. పార్లమెంటు నియోజక వర్గ పరిధిలోని ఆరు అసెంబ్లీ సీట్లు గెలిచాము. మొత్తం ఏడు నియోజక వర్గాల నుంచి వచ్చిన ముఖ్య కార్యకర్తలు మంచి సూచనలు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే లోక్ సభ ఎన్నికల్లో కష్టపడి పని చేస్తామని కార్యకర్తలు భరోసా ఇచ్చారు. కేటీఆర్, హరీష్ రావు ల ప్రసంగాలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయన్నారు.

Also Read.. ముల్లును ముల్లుతోనే తీద్దాం. కాంగ్రెస్ మేనిఫెస్టోనే మనకు ఆయుధం

కాంగ్రెస్ ప్రభుత్వం బనాయిస్తున్న అక్రమ కేసులను సమావేశంలో కార్యకర్తలు ప్రస్తావించారు. కార్యకర్తలు అధైర్య పడొద్దని అండగా ఉంటామని పార్టీ అగ్రనేతలు వారికి హామీ ఇచ్చారు.  కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆపాలని చూస్తోంది. ఆపిన నిధులను వెంటనే విడుదల చేయాలి. కేసీఆర్ అభ్యర్థి ఎవరిని ఖరారు చేసినా మెదక్ లోక్ సభ స్థానాన్ని నాలుగో సారి కైవసం చేసుకుంటామని ఆమె అన్నారు.

Latest News

More Articles