Sunday, May 19, 2024

ఆభరణాల కోసమే ఇద్దరు మహిళల హత్యలు.. కేసులను ఛేదించిన పోలీసులు

spot_img

నాగర్ కర్నూల్ జిల్లా: ఇద్దరు మహిళల హత్యల కేసులను కల్వకుర్తి పోలీసులు ఛేదించారు. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వివరాలను మీడియాకు వెల్లడించారు. బంగారు వెండి ఆభరణాల కోసమే హత్యలు చేసినట్లు స్పష్టం చేశారు. ఇద్దరు మహిళల హత్యలతో పాటు మేకల దొంగతనాలకు పాల్పడ్డ వెంకటేష్, అలివేలు అనే నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

Also Read.. తేజ vs మహేష్.. మొదటివారం మొనగాడు ఎవరో తేలిపోయింది..!

తర్నికల్ కు చెందిన నాగమ్మ, బల్మూరుకు చెందిన బాలకిస్టమ్మలను నగల కోసం నిందితులు హత్య చేసారన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. నిందితుల నుంచి 5.8 తులాల బంగారం, 650 గ్రాముల వెండి, 9 మేకలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసులను త్వరితగతిన ఛేదించిన కల్వకుర్తి డీఎస్పీ పార్థసారథి, సిబ్బందికి రివార్డ్స్ అందజేసి ప్రశంసించారు.

Latest News

More Articles