Tuesday, May 21, 2024

జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నలుగురికి జీవితఖైదు

spot_img

మహిళా జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో ఢిల్లీలోని సాకేత్ కోర్టు నలుగురికి జీవిత ఖైదు విధించింది. మరో ముద్దాయికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2008లో ఢిల్లీలోని వసంత్ కుంజ్ దగ్గర ఈ హత్య జరిగింది.

ఓ టీవీ చానల్లో జర్నలిస్టుగా పనిచేస్తున్న సౌమ్య విశ్వనాథన్ విధులు ముగించుకుని ఇంటికి కారులో తిరిగి వస్తుండగా, దారిలో ఆమెను అటకాయించిన వ్యక్తులు కాల్చి చంపారు. బుల్లెట్ గాయాలతో ఆమె కారులోనే చనిపోయింది. ఈ కేసులో రవి కపూర్, అజయ్ కుమార్, బల్జీత్ మాలిక్, అమిత్ శుక్లా కు జీవిత ఖైదు విధించింది కోర్టు. అజయ్ సేథీ అనే వ్యక్తిని 5వ నిందితుడిగా తెలిపింది. సౌమ్య విశ్వనాథన్ వాహనాన్ని అజయ్ సేథీ అడ్డగించాడని ప్రాసిక్యూషన్  పేర్కొంది. 411 సెక్షన్ కింద అతడు దోషిగా నిరూపణ అయింది. కాగా నిందితులు ఆమెను దోపిడీ కోసమే హత్య చేసినట్టు దర్యాప్తులో తెలిసింది.

ఇది కూడా చదవండి: మోడీ, రాహుల్‌ తో తెలంగాణకు మేలు జరుగదు

Latest News

More Articles