Sunday, May 5, 2024

ఎన్నికలు వస్తే ఎవరు మంచి చేశారు అనేది ఆలోచించాలి

spot_img

ఎన్నికలు వస్తే ఎవరు మంచి చేశారనేది ఆలోచించాలన్నారు మంత్రి హరీశ్ రావు. నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే నేడు పోదాం పద బిడ్డ సర్కారు దవాఖాన అంటున్నారని అన్నారు. జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి కి మద్దతుగా మంత్రి హరీశ్ రావు ప్రచారం చేశారు. ప్రచారంలో బాగంగా మాట్లాడిన ఆయన.. 24 గంటల కరెంట్ తీసి మళ్ళా 3 గంటల కరెంట్ తెస్తారా.. అదేనా మార్పు అంటే? అని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. మూడు గంటల్లో మూడు ఎకరాలు పారుతాయా?. 10 HP మోటర్లు రైతులు పెడతారా.. అవగాహన లేకుండా పిచ్చోడి లెక్క రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నడు. కవర్ చేయకుందామని శివ కుమార్ దమాక్ లేని మాటలు మాట్లాడాడు. మొన్న 5 గంటలు చాలు అని.. నేడు 7 గంటలు చాలు అంటున్నడు. కాంగ్రెస్ హయాంలో చీకటి రోజులు, కరెంట్ కోతలు, మళ్ళా అలాంటి రోజులు వద్దన్నారు.

ఇది కూడా చదవండి:జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నలుగురికి జీవితఖైదు

అక్కా చెల్లెలు అందరూ మా ఓట్లు గంప గుత్తగా కేసీఆర్ కే అంటున్నారని తెలిపారు మంత్రి హరీశ్ రావు. అనేక పథకాలు తెచ్చింది కేసీఆర్. కొత్తగా సౌభాగ్య లక్ష్మి పథకం తెస్తున్నారు. నెలకు 3 వేలు వస్తాయి. సన్నబియ్యం, పాత బియ్యం ఇవ్వబోతున్నాము. రైతు బంధు 16 వేలు ఇస్తాం. అభివృద్ధి కొనసాగాలంటే సారు గెలవాలి. మన సర్కార్ రావాలన్న మంత్రి హరీశ్ రావు..పల్లా రాజేశ్వర్ రెడ్డిని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఇది కూడా చదవండి: మోడీ, రాహుల్‌ తో తెలంగాణకు మేలు జరుగదు

Latest News

More Articles