Friday, May 17, 2024

వెయ్యి మంది ఉద్యోగులను తొలగించిన గూగుల్

spot_img

టెక్ దిగ్గ‌జం గూగుల్ మ‌రో ద‌శ లేఆఫ్స్ ను చేపట్టింది. లేటెస్ట్ లేఆఫ్స్ లో భాగంగా సెర్చింజ‌న్ దిగ్గ‌జం ఏకంగా 1000 మందిని విధుల నుంచి తొల‌గించిన‌ట్టు స‌మాచారం. గూగుల్ హార్డ్ వేర్‌, సెంట్ర‌ల్ ఇంజనీరింగ్ టీమ్‌లు, గూగుల్ అసిస్టెంట్ స‌హా ప‌లు విభాగాల్లో ఉద్యోగులను తీసివేసింది. లేఆఫ్స్ గురించి ముంద‌స్తు స‌మాచారం ఇవ్వ‌లేక‌పోయినందుకు చింతిస్తున్నామ‌ని, సంక్లిష్ట నిర్ణ‌యం తీసుకోవాల్సివ‌చ్చింద‌ని బాధిత ఉద్యోగుల‌కు పంపిన ఈమెయిల్‌లో కంపెనీ తెలిపింది.

అర్హులైన ఉద్యోగుల‌కు ప‌రిహార ప్యాకేజ్ వ‌ర్తింప‌చేస్తామ‌ని గూగుల్ స్ప‌ష్టం చేసింది. ఇత‌ర విభాగాల్లో ఎంపిక చేసిన అవ‌కాశాల‌కు వేటుకు గురైన ఉద్యోగులు తిరిగి ద‌ర‌ఖాస్తు చేసుకోచ్చ‌ని చెప్పింది. కంపెనీలో తిరిగి అవ‌కాశం ద‌క్క‌ని ఉద్యోగులు ఏప్రిల్‌లో కంపెనీని వదిలి వెళ్లాల్సిందిగా  తెలిపింది.

ఇది కూడా చదవండి: వస్త్ర పరిశ్రమపై కాంగ్రెస్‎కు కేటీఆర్ కీలక సూచన

Latest News

More Articles