Friday, May 3, 2024

ఓటీటీలో విడుదలైన గోపిచంద్ ‘రామబాణం’

spot_img

గోపీచంద్‌, డింపుల్ హయతీ నటీనటులుగా శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రామబాణం’. ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్ర పోషించగా, ఖుష్బూ మరో ప్రధాన పాత్రలో నటించారు. మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మాస్‌ యాక్షన్‌ డ్రామా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‎గా నిలిచింది. విడుదలకు ముందు పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్‌‎తో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా.. థియేటర్లలోకి వచ్చాక పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రోటీన్‌ కథ కావడంతో ప్రేక్షకులకి అంతగా నచ్చలేదు కానీ, గోపీచంద్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ మాత్రం ఫ్యాన్స్‌ని బాగా మెప్పించాయి.

Read Also: 49 ఏళ్ల వన్డే క్రికెట్‌ చరిత్రలో తొలిసారి..!!

కాగా.. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. రామబాణం మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. సెప్టెంబర్‌ 14 అర్ధరాత్రి నుంచే ఈ మూవీ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, కన్నడ భాషలలో రామబాణం సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమాను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల నిర్మించారు. ఈ మూవీలో నాజర్, తరుణ్‌ అరోరా, వెన్నెల కిశోర్‌ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. మిక్కీ జే మేయర్‌ ఈ సినిమాకు సంగీతం అందించారు.

Read Also: పోర్న్‌ వీడియోలను చూడటంపై కేరళ హైకోర్టు సంచలన తీర్పు

Latest News

More Articles