Friday, May 3, 2024

తెలంగాణలో భారీగా ఎండలు..ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.!

spot_img

మార్చిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఐఎండీ చెబుతోంది. ఈ విషయంపై ఐఎండీ ప్రజలకు హెచ్చరికలు కూడా జారీచేసింది. మొన్నటివరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురిసిన విషయం తెలసిందే. ఇప్పుడు ఉదయం 7 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండు. ఈ క్రమంలో తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మార్చి 27 నుంచి మార్చి 29 వరకు తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఈనేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఆసిఫాబాద్, పెద్దపల్లి,మంచిర్యాల జిల్లాల్లో రానున్న జిల్లాలో విపరీతమైన ఎండలు ఉండబోతున్నాయని ఈరోజుల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు అధికారులు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మార్చి 27న కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ గా ఉండాలని ప్రకటించారు. మార్చి 28వ తేదీన విపరీతమైన వేడిగాలులు కొనసాగుతున్నాయని అధికారులు అన్నారు. ఒక్క సోమవారం నాడే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని అన్నారు. నల్లగొండలోని తిమ్మాపూర్, భద్రాద్రి కొత్తగూడెంలోని సుజాతనగర్ లో మార్చి 25న 40.8డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్ లోని షేక్ పేట్ లో అత్యధికంగా 39.02 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.

ఇది కూడా చదవండి: రామ్ చరణ్ కూతురు క్లిన్ కార ఫొటో వైరల్..పాప మొహాన్ని చూపించిన ఉపాసన.!

Latest News

More Articles