Friday, May 10, 2024

ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ కానుక..!

spot_img

హోలీ పండుగ ఘనంగా ముగిసింది. కానీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ కానుక త్వరలోనే అందించనుంది. మార్చి 30 ఇంక్రిమెంట్స్ తో కేంద్రం జీతాలను అందజేయనుంది. మార్చి 31న ఆదివారం సెలవు కావడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన జీతాలను మార్చి 30నే అందుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుత ఆర్థిక ఏడాది చివరి రోజు కావడంతో మార్చి 31న ఆదివారం బ్యాంకులు తెరవాలని ఆర్బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే.

కాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్ నెస్ అలవెన్స్ లేదా డీఏ 4శాతం పెంచేందుకు సర్కార్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం ఉద్యోగుల అలవెన్స్ 46వాతం నుంచి 50శాతానికి పెరిగింది. 2024 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో జనవరి, ఫిబ్రవరి బకాయిలు మార్చి పెరిగిన జీతం కూడా అందుకోనున్నారు. డిఏ అనేది ప్రభుత్వ ఉద్యోగి జీతంలో కీలక భాగం. ద్రవ్యోల్బణం ప్రభావాలను ఎదుర్కోవడానికి దీన్ని రూపొందించారు. ఈ అలవెన్స్‌ను సాధారణంగా ఏడాదికి రెండు సార్లు మార్చి, సెప్టెంబరులో సవరిస్తారు. పెరుగుతున్న జీవన వ్యయాన్ని భరించేలా, మొత్తం జీతం పెంపునకు డీఏ సహాయపడుతుంది. కాగా డీఏ క్యాలిక్యులేషన్‌ ఫార్ములాను 2006లో సవరించారు. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) 12 నెలల సగటు పెరుగుదల శాతం ఆధారంగా డియర్‌నెస్ అలవెన్స్ ను నిర్ణయిస్తుంది.

ఇది కూడా చదవండి: తెలంగాణలో భారీగా ఎండలు..ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.!

Latest News

More Articles