Saturday, April 27, 2024

విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కాలర్ షిప్ కింద రూ. 1.5లక్షలు..!

spot_img

దేశంలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలంటే ఆర్థిక పరిస్థితులు కారణంగా వారు మధ్యలోనే చదువును ఆపేయాల్సి వస్తోంది. అలాంటి వారి కోసం కేంద్రప్రభుత్వం శుభవార్త చెప్పింది.

డబ్బు లేదని విద్యార్థులు చదవును మధ్యలోనే ఆపేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు పిల్లల భవిష్యత్తు చదువుల కోసం ప్రభుత్వం డబ్బులు అందిస్తోంది.భారత ప్రభుత్వం నుంచి స్కాలర్ షిఫ్ అందుబాటులోఉంది. దీనిలో 9,10వ తరగతి విద్యార్థులు 75వేల రూపాయలు , 11, 12 తరగతుల విద్యార్థులు 1.5లక్షల రూపాయాల ఆర్థిక సహాయం పొందవచ్చు. ఈ స్కాలర్ షిప్ పేరు PM YASASVI (PM Yasasvi Scholarship Scheme).ఈ స్కీం పూర్తి పేరు బ్రైట్ ఇండియా కోసం పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డు. మెరిట్ ఆధారంగా 2023లో ఈ స్కాలర్ షిప్ కోసం విద్యార్ధులను ఎంపిక చేశారు. మరింత సమాచారం కోసం NTA వెబ్ సైట్ ను ఓ సారి చెక్ చేయండి.

దీన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. PM YASASVI స్కాలర్‌షిప్ స్కీం కోసం మీరు సామాజిక న్యాయం , సాధికారత శాఖ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. హోమ్ పేజీలోకి  వెళ్లి పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ స్కీమ్ లింక్‌పై క్లిక్ చేయండి.ఇప్పుడు అక్కడ నమోదు చేసుకోండి. మెసేజ్ ద్వారా ఫోన్‌కు రిజిస్ట్రేషన్ నంబర్ పాస్‌వర్డ్ వస్తుంది. ఇప్పుడు పూర్తి దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. అవసరమైన అన్ని పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేస్తే..అప్పుడు మీ అప్లికేషన్ ఫారమ్ పూర్తవుతుంది.

ఇది కూడా చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ కానుక..!

Latest News

More Articles