Saturday, June 22, 2024

ఆర్సీబీ కథ ముగిసింది..ఎలిమినేటర్​లో రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ.!

spot_img

ఐపీఎల్ 17వ సీజన్ లో ఆర్సీబీ కథ ముగిసింది. అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచులో ఆర్సీబీ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 19 ఓవర్లలోనే ఛేదించింది.

యశస్వీ జైస్వాల్ 45 పరుగులు చేయగా రియాన్ పరాగ్ 36 పరుగులు చేసి రాణించారు. చివరిలో షిమ్రన్ హెటెమెయర్ 26 పరుగులు రోవ్ మన్ పావెల్ 16 పరుగులు చేసి రాజస్థాన్ విజయానికి కారణమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు, లాకీ ఫెర్గ్యూసర్ , కరశ్ శర్మ , కామెరూన్ తలో వికెట్ తీసుకున్నారు.

లక్ష్య ఛేదనలో రాజస్థాన్ జైస్వాల్, కాడ్మోర్ మంచి ఆరంభం ఇచ్చారు. కాడ్మోర్ 5.3 దగ్గర ఫెర్గ్యూసన్ కు చేతికి చిక్కాడు. కానీ ఆ తర్వాత కూడా జైస్వాల్ దూకుడు ప్రదర్శించాడు. కెప్టెన్ సంజూశాంసన్ 17 పరుగులు మాత్రమే చేశాడు. ఇక మిడిల్ లో రియన్ పరాక్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.

ధ్రువ్ జురెల్ రనౌట్ తో మ్యాచ్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. అయినా కూడా తర్వాత వచ్చిన హెట్ మెయర్ మరింత దూకుడుగా ఆడాడు. లాస్ట్ లో హెట్ మెయర్ ఔటయ్యాడు. పావెల్ 19 ఓవర్లలో రెండు 4, ఒక 6తో మ్యాచును ముగించాడు.

ఇది కూడా చదవండి: పెళ్లి చేసుకోవడం లేదని ప్రభాస్ సెన్సేషనల్ కామెంట్స్..

Latest News

More Articles