Sunday, May 19, 2024

ఇస్రో మరో రికార్డు.. లగ్రాంజ్‌ పాయింట్‌కు ఆదిత్య-ఎల్‌1

spot_img

న్యూఢిల్లీ: ఇస్రో మరో రికార్డు నమోదు చేసింది.  ‘ఆదిత్య-ఎల్‌1’ వ్యోమనౌకను శనివారం లగ్రాంజ్‌ పాయింట్‌1 కక్ష్యలోకి విజయవంతంగా చేరింది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య-ఎల్‌1 ను ఇస్రో ప్రయోగించిన విషయం తెలిసిందే.

Also Read.. శబరిమల వద్ద అగ్నిప్రమాదం

భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్‌ పాయింట్‌ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలోకి తాజాగా ఇస్రో సైంటిస్టులు విజయవంతంగా పంపించారు. ఇక్కడి నుంచి ఇది నిరంతరం సూర్యుడిని పర్యవేక్షిస్తుందని ఇస్రో వెల్లడించింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ప్రధాని మోదీ ఎక్స్‌లో వెల్లడించారు. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

Also Read.. అసెంబ్లీ ఎదుట యాక్సిడెంట్.. మోటరిస్ట్ మృతి

భారత్‌ తరఫున సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్‌ ఇదే. గతేడాది సెప్టెంబరు 2న శ్రీహరికోట నుంచి ఆదిత్య-ఎల్‌1 ను ప్రయోగించారు. ఈ వ్యోమనౌకలో ఉన్న ఏడు పేలోడ్లు సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్‌ తదితర విషయాలను అధ్యయనం చేయనుంది. ఆదిత్య ఎల్‌-1 127 రోజులపాటు సుదీర్ఘంగా ప్రయాణించి 1.5 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యస్థానానికి శుక్రవారం చేరింది.

Latest News

More Articles