Friday, May 3, 2024

స్టాయినిస్ ఊచకోత.. రికార్డు ఛేజింగ్

spot_img

బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్‌ జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆడిలైడ్ స్ట్రైకర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని మెల్‌బోర్న్‌  మూడే వికెట్లు కోల్పోయి ఒక ఓవర్‌ మిగిలుండగానే ఛేదించింది. టోర్నీ చరిత్రలో ఇదే అత్యధిక పరుగుల ఛేదన.

మెల్‌బోర్న్‌ బ్యాటర్లలో డానియల్ లారెన్స్‌ 50 (26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), బ్యూ వెబ్‌స్టర్ 66 నాటౌట్ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), చివర్లో మార్కస్‌ స్టాయినిస్  55 నాటౌట్ ( 19 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించారు.

అంతకుముందు క్రిస్‌లిన్‌ 83 (42 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), మాథ్యూ షార్ట్ 56 (32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు)  విరుచుకుపడటంతో ఆడిలైడ్ జట్టు భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌ను స్టేడియంలో రికార్డు స్థాయిలో 42,504 మంది అభిమానులు వీక్షించారు.

Latest News

More Articles