Sunday, May 19, 2024

వైద్యుల త‌యారీ క‌ర్మాగారంగా తెలంగాణ రాష్ట్రం

spot_img

ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద రూ. 180 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులకు, ఆ పక్కనే రూ. 2 రెండు కోట్ల 36 లక్షల రూపాయల నిధులతో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని అనంతరం ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.

Read Also: హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ములుగు, నర్సంపేట మెడికల్ కాలేజీలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు నేడు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకోవడం సంతోషంగా ఉంది. ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలో నెంబర్ వన్‎గా నిలిచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వైద్యం సామాన్యులకు చేరువైంది. దేశంలో 157 మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు మంజూరు చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. మన రాష్ట్రంపై వివక్షతో ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకపోయినా, సీఎం కేసీఆర్ సొంతంగా మెడికల్ కాలేజీలు పెడుతున్నారు. తెలంగాణకు జరిగిన ఈ అన్యాయంపై ఏ ఒక్క బిజేపీ, కాంగ్రెస్ నాయకులు ఏనాడు మాట్లాడలేదు, ఒక్కనాడూ పార్లమెంట్‎లో ప్రశ్నించలేదు. అభివృద్ధికి నోచుకోక ప్రాణాలు కోల్పోయిన చోట.. ప్రాణాలకు తెగించి, తెలంగాణ తెచ్చిన సీఎం కేసీఆర్, ఇవ్వాళ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుచేస్తున్నారు. 350 బెడ్స్‎తో జిల్లా హాస్పిటల్, నర్సింగ్ కాలేజీ, పారా మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నాం.

Read Also: ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జనం పూర్తి

ఇవ్వాళ ములుగు, నర్సంపేట మెడికల్ కాలేజీలకు మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఒక్కో మెడికల్ కాలేజీకి రూ. 183 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఇప్పటివరకు 21 మెడికల్ కాలేజీలను ప్రారంభించుకున్నాం. మిగతా 8 కాలేజీలు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించుకుంటాం. ఒకప్పుడు వైద్య విద్య కోసం బయటి దేశాలకు, పక్క రాష్ట్రాలకు వెళ్లి చదువుకునేవాళ్లం. తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం అయ్యేది. తెలంగాణ ఏర్పడ్డ నాడు రాష్ట్రంలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవి. అందులో 3 మెడికల్ కాలేజీలు గత ప్రభుత్వాల ప్రమేయం లేకుండానే ఏర్పాటయ్యాయి. 60 ఏళ్ల ఉమ్మడి పాలనలో ఏర్పాటు చేసినవి రెండే రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. 2014లో 5 మెడికల్ కాలేజీల ద్వారా 850 మెడికల్ సీట్లు ఉంటే, 2023 నాటికి 26 మెడికల్ కాలేజీలతో కలిపి మెడికల్ సీట్ల సంఖ్య 3 వేల 690కి చేరింది. ప్రభుత్వ, ప్రైవేటులో కలిపి ఏటా 10 వేల మంది విద్యార్థులను డాక్టర్లుగా తయారు చేసే స్థాయికి నేడు తెలంగాణ ఎదిగింది. వైద్యుల త‌యారీ క‌ర్మాగారంగా తెలంగాణ రాష్ట్రం మారింది. రాష్ట్రంలోని మెడిక‌ల్ కాలేజీల్లో 85శాతం సీట్లు స్థానికుల‌కే దక్కే విధంగా చట్టాన్ని మార్చారు. ఇవ్వాళ ఉమ్మ‌డి వరంగల్ జిల్లాలోనే ఐదు మెడిక‌ల్ కాలేజీలు, హాస్పిట‌ల్స్‌ వచ్చాయి. మెడిక‌ల్ హ‌బ్‎గా వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లా కేంద్రం తయారైంది. వ‌రంగ‌ల్‎లో రూ.11 వందల కోట్ల‌తో అంత‌ర్జాతీయ స్థాయి సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్‌ ఏర్పాటు అవుతున్నది. దేశంలో వైద్య రంగంలో 3వ స్థానంలో రాష్ట్రం ఉంది. బాగా చ‌దివి వైద్యులుగా మ‌న జిల్లాకు, రాష్ట్రానికి అంత‌ర్జాతీయ కీర్తిని తీసుకురావాలి. సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, హరీష్ రావు ఎంతో కష్టపడి పని చేస్తున్నారు. కేసీఆర్ స్ఫూర్తి, హరీశ్ రావు కృషి వల్లే ఇవ్వాళ వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందింది. ఒక విజన్‎తో పని చేస్తున్న సీఎం కేసీఆర్‎కు మనమంతా రుణ‌ప‌డి ఉండాలి’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

Read Also: రికార్డు ధర పలకిన బాలాపూర్ గణేష్ లడ్డూ.. డబ్బు చెల్లింపులో కొత్త నిబంధన

Latest News

More Articles