Sunday, May 5, 2024

సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వైద్య విప్లవం సృష్టించారు

spot_img

జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుచేసి.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వైద్య విప్లవం సృష్టించారని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో నూతన మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద రూ. 180 కోట్లతో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులకు, ఆ పక్కనే రూ. 2 రెండు కోట్ల 36 లక్షల రూపాయల నిధులతో 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ములుగు ఏరియా ఆస్పత్రిలో నవజాత శిశువుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడ అర్హులైన వారికి దళిత బంధు, గృహలక్ష్మి, భూ యాజమాన్య పత్రాలను స్వయంగా తన చేతుల మీద అందజేశారు. అంగన్వాడికి టీచర్లకు కిట్స్ అందజేశారు. వరద బాధితులకు వైద్య సాయం అందించిన పీహెచ్సి డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి, రెడ్ కో చైర్మన్ వై సతీష్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.

Read Also: ఖైరతాబాద్‌ గణేశుడి నిమజ్జనం పూర్తి

ఈ సందర్భంగా ములుగు బహిరంగ సభలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. ‘ములుగులో మెడికల్ కాలేజీ కోసం శంకుస్థాపన చేసుకోవడం సంతోషం. జగదీష్ బతికి ఉంటే మెడికల్ కాలేజీ రావడం చూసి సంతోష పడేవాడు. కేసీఆర్ లేకుంటే ములుగు జిల్లా అయ్యేదా? మెడికల్ కాలేజీ వచ్చేదా? కళ్యాణ లక్ష్మికి స్ఫూర్తి ఈ ములుగు జిల్లానే. కొన్నేండ్ల క్రితం గుత్తూరు తండాలో 12 ఇల్లు కాలిపోయాయి. బిడ్డకు పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉన్న ఆ తండ్రిని చూసి కేసీఆర్ చలించి పోయారు. ఆ పెళ్ళికి అండగా ఆర్థిక సాయం చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక అదే స్పూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి ప్రారంబించారు. కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు.. ఇప్పటివరకు 12 లక్షల మంది అర్హులకు, 11 వేల కోట్లు ఇచ్చారు. అమ్మాయి తల్లి పేరు మీద చెక్ ఇస్తున్నారు.

Read Also: హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత

పోడు భూముల విషయంలో 4 లక్షల 6 వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చారు. ములుగులోనే 14 వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చారు. అతి ఎక్కువ పోడు పట్టాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. పోడు భూములకు రైతు బంధు, రైతు బీమా, రుణ మాఫీ ఇలా రైతులకు ఎన్నో చేశారు, వారిపై ఉన్న కేసులు ఎత్తివేశారు. నక్సలైట్ ఉద్యమం ఇక్కడ పుట్టింది. కేసీఆర్ నాయకత్వంలో అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. నాడు ఎన్ కౌంటర్లు, రైతు చావులు, ఎరువుల కొరత, కరెంట్ కొరత ఉండేది. నేడు ఇంటింటికీ తెలంగాణ ప్రభుత్వ పథకాలు చేరువ అయ్యాయి.

Read Also: బాలాపూర్ లడ్డూ తొలి వేలం కేవలం రూ.450.. 30 ఏండ్లుగా ఎవరెవరు దక్కించుకున్నారంటే?

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ చొరవతో ప్రభుత్వ ఆస్పత్రులలో డెలివరీలు పెరిగాయి. నాడు 30 శాతం డెలివరీలు ఉంటే.. అవి నేడు 76 శాతానికి చేరాయి. అతి ఎక్కువ ప్రభుత్వ డెలివరీలు ఉన్న రెండో జిల్లాల్లో మొదటిది నారాయణ్ ఖెడ్ కాగా.. ములుగు రెండోస్థానంలో నిలిచింది. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రులలో 83 శాతం డెలివరీలు జరగటం సంతోషం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వరద సమయంలో ఏటూరు నాగారంలో డయాలసిస్ సెంటర్ పెట్టాం. గూడేలు, తండాలను పంచాయతీలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‎ది. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడంతో 2 లక్షల ర్యాంకు వచ్చినా మా గిరిజన పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. నాడు ములుగులో డాక్టర్ ఉండటం గొప్ప, నేడు డాక్టర్లను తయారు చేసే మెడికల్ కాలేజీ ఇచ్చింది కేసీఆర్. ఇప్పుడొచ్చిన మెడికల్ కాలేజీ అంటే చదువు మాత్రమే కాదు, ఇందులో 450 పడకల ఆసుపత్రి కూడా ఉంటుంది. అన్ని రకాల స్పెషాలిటీ వైద్యం ఇక్కడే అందుబాటులోకి వచ్చింది. ములుగు దవాఖానలో దాదాపు వంద మంది వైద్యులు ఉంటారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి, రాష్ట్రంలో కేసీఆర్ వైద్య విప్లవం సృష్టించారు’ అని మంత్రి హరీష్ రావు అన్నారు.

Read Also: హైదరాబాద్‎లో రూ.1.26 కోట్లు పలికిన గణేష్ లడ్డూ

Latest News

More Articles