Friday, May 17, 2024

60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒరిగిందేమీ లేదు.. బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం

spot_img

సూర్యాపేట: కాంగ్రెస్ కు ఓటేస్తే ఆ నాయకులకు వచ్చేది పదవులు మాత్రమే అయితే… బీఆర్ఎస్ కు వేసే ఓటుతో ప్రజలకు సంక్షేమ పథకాలు వస్తాయని సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్ధి, రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గం లోని పెన్ పహాడ్ మండలం అనంతారం, అన్నారం , అన్నారం బ్రిడ్జి, నారాయణగూడెం, నాగుల పహాడ్ గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Also Read.. కాంగ్రెస్ వస్తే చిమ్మ చికట్లే

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు ప్రజల భవిష్యత్తును మార్చే ఎన్నికలు అన్నారు. రాష్ట్రాన్ని దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ పాలనలో ఒరిగిందేమీలేదన్నారు. ఎవరికి వేసిన ఓటు ఏం తెచ్చిందో ప్రజల ఆలోచించాలి అన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత నాదే అన్నారు. రైతుబంధు రైతు బీమా 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి  వంటి పథకాలు ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు. పట్టణాలకు దీటుగా గ్రామాల అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని అన్నారు.

Also Read.. ఇచ్చిన మాటను నెరవేర్చే గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్

గత పాలనలో లక్ష రూపాయిలు కూడా అభివృద్ధి , సంక్షేమం కోసం వచ్చేవి కావన్న మంత్రి, ఒక్కో గ్రామానికి అభివృద్ధి- సంక్షేమకోసం కోట్లాది రూపాయల నిధులు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే కరెంటు కష్టాలు రావడం ఖాయం అన్న మంత్రి, కర్ణాటక పరిస్థితులే ఇక్కడా పునరావృతం అవుతాయన్నారు.

పదవులకోసం ఆంధ్ర పాలకులకు అడుగులకు మడుగులొత్తి రైతులకు అన్యాయం చేసిన పాపం నల్లగొండ కాంగ్రెస్ నాయకులదన్నారు. నల్లగొండ కాంగ్రెస్ నాయకుల చేతగాని తనం వల్లే వరుసగా  ఏడు ఏళ్లు ఎడమకాలువ ఎండిపోయింది అన్నారు. వరుసగా 18 పంటలకు సాగు నీరు రావడంతో  ఆంధ్రాలో ఎకరం అమ్ముకొని తెలంగాణలో 10 ఎకరాలు కొనే రోజులు పోయి, తెలంగాణలో ఎకరం అమ్ముకొని ఆంధ్రలో 100 ఎకరాలు కొనే రోజులు వచ్చాయని అన్నారు.

Also Read.. పనిచేసే ప్రభుత్వాన్నే ప్రజలు ఆశీర్వదిస్తారు

మరోసారి గెలిపిస్తే, తెల్ల రేషన్ కార్డ్ ఉన్న 93 లక్షల కుటుంబాలకు ఐదు లక్షల బీమా సదుపాయం, అన్నపూర్ణ పథకం కింద అందరికీ సన్న బియ్యం, దశలవారీగా ఆసరా పెన్షన్ 5 వేల 16 లు, దివ్యాంగులకు 6వేలు, రైతుబంధు 16,000, అగ్రవర్ణ పేదలకు ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున గురుకులాల నిర్మాణం, కెసిఆర్ ఆరోగ్య రక్ష కింద ఆరోగ్య బీమా పరిమితిని 15లక్షల పెంపు, అర్హులైన పేద కుటుంబాల మహిళలకు సౌభాగ్య లక్ష్మి కింద నెలకు 3000 రూపాయలు, మహిళా సమాఖ్య సొంత భవనాలు, కుల మతాలకు అతీతంగా ఇల్లులేని ప్రతి ఒక్కరికి పక్కా గృహాలు నిర్మిస్తామని తెలిపారు. మంత్రి ప్రచారం సందర్భంగా కాంగ్రెస్, బిజెపి లకు చెందిన వందలాదిమంది నేతలు కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Latest News

More Articles