Friday, May 17, 2024

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వివరాలతో కూడిన వెబ్సైట్.. ప్రారంభించిన కేటీఆర్

spot_img

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర యువతను తప్పుదోవ పట్టిస్తున్ననేపథ్యంలో గత పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగ వివరాలతో కూడిన ఒక ప్రత్యేక వెబ్సైట్ ను భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు ప్రారంభించారు. తాము ఇచ్చిన లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కన్నా రెట్టింపుకు పైగా ఉద్యోగాలను కల్పించామని తెలిపిన కేటీఆర్.. ఇందుకు సంబంధించిన అధికారిక లెక్కలతో కూడిన ఈ వెబ్సైట్ ను ప్రారంభించారు. 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలను 9.5 సంవత్సరాలలో గుర్తించి, లక్ష అరవై వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని పూర్తి చేసామని కేటీఆర్ తెలిపారు.

Also Read.. మూసీ ప్రాజెక్టును నాశ‌నం చేసిందే కాంగ్రెస్ పార్టీ

జనాభాతో పోల్చి చూసినప్పుడు దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు.  సోమవారం ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంసిద్ధం అవుతున్న యువకులతో సుదీర్ఘంగా చర్చించిన కేటీఆర్.. వారి విజ్ఞప్తి మేరకు ప్రజలకు ముఖ్యంగా యువకులకు అందుబాటులో ఉండేలా ఈ వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత కూడా పలు రాజకీయ పార్టీలు చేస్తున్నతప్పుడు ప్రచారం వలన యువతలో పలు అపోహలు నెలకొన్నాయని వారు మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు.

Also Read.. కండ్ల ముందు ఉన్న అభివృద్ధిని నమ్మి ఓటేయ్యండి

నిన్న జరిగిన చర్చ సందర్భంగా వారికి మంత్రి కేటీఆర్ ప్రభుత్వ అధికారిక లెక్కలతో కూడిన వివరాలను అందించారు. కేటీఆర్ అందించిన సమాచారం పట్ల సంతృప్తి, ఆశ్చర్యం వ్యక్తం చేసిన వారు వీటన్నింటిని రాష్ట్ర యువతకు అందుబాటులో ఉంచాలని కోరారు. ఈరోజు ప్రారంభించిన ఈ వెబ్ సైట్ లో ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలతో పాటు, అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయడం, విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల శిక్షణ కోసం మరిన్ని స్టడీ సర్కిల్ ఏర్పాటు వంటి అంశాలపైన వివరాలు అందుబాటులో ఉంచారు.

Also Read.. కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లింది.. బిజెపికి ఉనికి లేదు

రాష్ట్రంలోని ప్రతి ఒక్క విద్యార్థి, యువతి యువకులు ఈ వెబ్సైట్ని సందర్శించి నిజాలు తెలుసుకోవాలని కేటీఆర్ కోరారు. www.telanganajobstats.in లో అన్నీ వివరాలు ఉంచినట్లు కేటీఆర్ తెలిపారు.

Latest News

More Articles