Tuesday, May 7, 2024

అభివృద్ధి కొనసాగాలంటే.. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి.. కేటీఆర్

spot_img

హైదరాబాద్: ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఏమేమి చేశామో ప్రజలందరికి తెలుసు.. ఆనాడు మనల్ని ఎంతో మంది అవమానించిన్రు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎంత అభివృద్ధి చెందిందో మీ కండ్ల మందట ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. జరుగుతున్న అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ అధికారంలో ఉండాలన్నారు. అనతి కాలంలోనే రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ స్థానంలో నిలిపిన సీఎం కేసీఆర్ ను మరోసారి ఆశీర్వదించి, మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కేటీఆర్ కోరారు. కంటోన్మెంట్, సనత్ నగర్ నియోజకవర్గాలలో రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థలను భారీ మెజారిటీ గెలిపించాలని కోరారు.

Also Read.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వివరాలతో కూడిన వెబ్సైట్.. ప్రారంభించిన కేటీఆర్

‘‘మన హైదరాబాద్ ఎంత డెవలప్మెంట్ అయిందో మొన్న వచ్చిన సినీ హీరో రజినీకాంత్ చెప్పిన్రు.. కంటోన్మెంట్ లో ఒక సమస్య ఉంది. భూములకు పట్టాలు ఇవ్వడం. కానీ ఇక్కడ స్థలం లేక సమస్య వస్తుంది. దీనిపై కేంద్రానికి చాలా సార్లు ఆడిగినం కానీ ఇప్పటికీ స్పందిస్తాలేరు. గ్రేటర్ హైదరాబాద్ లో 20 వేల లీటర్ల వరకు ఉచితం గా  మంచినీరు ఇస్తున్నాం. కేసీఆర్ అడబిడ్డలకు కేంద్రం పెంచిన గ్యాస్ సిలిండర్ ధర 800 రూపాయల ఉన్న గ్యాస్ సిలిండర్ ని 400 రూపాయలకు ఇస్తాడు.

ఆడపడుచులకు సౌభాగ్య లక్ష్మీ అనే పథకాన్ని తీసుకొస్తున్నాం. తెల్లకార్డు ఉన్న ప్రతి కుటుంబానికి “అన్నపూర్ణ” పథకం ద్వారా సన్న బియ్యాన్ని ఉచితంగా ఇస్తాం. హైదరాబాద్ లో ప్రతి కుటుంబానికి “కుటుంబ భీమా” పథకం ద్వారా 5 లక్షల భీమా ఇస్తాం. బొల్లారం, అల్వాల్ లో 1000 పడకల ఆసుపత్రి ప్రారంభించబోతున్నాం. ఇప్పటికె అనేక పనులు చేసుకుంటాం కానీ కేంద్రం అడ్డుపడుతుంది. “గృహ లక్ష్మీ” పథకం ద్వారా సొంత జగ ఉంటే 3 లక్షల ఇస్తాం’’ అని కేటీఆర్ అన్నారు.

24 గంటలు కరెంట్ ఎలా వస్తుందో..24 గంటలు నీళ్లు రావాలి అంటే కేసీఆర్ గారే సీఎం గా ఉండాలి. కాంగ్రెస్ పార్టీలో 11 మంది సీఎం లు ఉన్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ బాగుంటూనే రాష్ట్రము బాగుంటుందన్నారు. హైదరాబాద్ లో మెట్రో ని విస్తరిస్తామని తెలిపారు. హైదరాబాద్ కాలుష్య రహితంగా మార్చాలని మా కల, అందుకు నగరం మొత్తం ఎలక్ట్రిక్ బస్సు పెట్టాలని ఆలోచన చేస్తున్నాం. ఢిల్లీ నుంచి అందరూ నాయుకులు దిగుతున్నారు. ఒక్క కేసీఆర్ ని కొట్టడానికి ఇంతమంది షేర్ లు, బబ్బర్ ఖాన్ లో దిగ్గుతున్నారు. మేము ఏమి భయపడటలేము. సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తది. కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ నుంచి నేతలు వస్తున్నారు. తొమ్మిదిన్నర సంవత్సరాలలో అభివృద్ధి చేసి చూపినం. కాంగ్రెస్, బిజెపి కి భవిష్యత్ ఎజెండా లేదు. తెలంగాణ భవిష్యత్ గురించి ఆలోచించే నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ పేర్కొన్నారు.

Latest News

More Articles