Sunday, May 19, 2024

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే సనత్ నగర్ అభివృద్ధి

spot_img

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే సనత్ నగర్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయని సనత్ నగర్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం రాంగోపాల్ పేట డివిజన్ లోని మంజు థియేటర్, ఆవుల మంద, నాగన్న దేవిడి, కళాసి గూడ, బర్ధన్ కాంపౌండ్, కండోజి బజార్ లలో పాదయాత్రగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Also Read.. బీజేపీకి భారీ షాక్.. డీకే అరుణ, విజయశాంతిల షాకింగ్ డెసిషన్ ?

ప్రతి ఇంట ఆయనకు మహిళలు నుదుటన తిలకం దిద్ది, మంగళ హారతులు పట్టి సాదర స్వాగతం పలికారు. శ్రీనన్న మీ వెంటే మేమన్న అని పలువురు ప్రకటించారు. ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ శాలువాలతో సత్కరిస్తూ తమ అభిమానాన్ని చాటారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 50 సంవత్సరాల నుండి ఎన్నో సమస్యలతో గోస పడుతున్న నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాలలోనే తొలగించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తన దృష్టికి వచ్చినే వెంటనే పరిష్కరిస్తూ వస్తున్నట్లు చెప్పారు.

Also Read.. కాంగ్రెస్ కు షాక్… గులాబీ పార్టీకి మద్దతు ప్రకటించిన ముస్లిం, మైనార్టీలు

గత 50 సంవత్సరాలలో ఈ ప్రాంతం నుండి గెలుపొంది గొప్ప గొప్ప పదవులను అనుభవించిన వాళ్ళు కూడా చేయలేని, ఎవరు ఊహించని స్థాయిలో అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ది గత నాయకులలో లేని కారణంగానే అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో సనత్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్దిలో మోడల్ గా తీర్చిదిద్దామని, మరోసారి తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మిగిలిన అభివృద్ధి పనులను కూడా చేపడతామని హామీ ఇచ్చారు.

Latest News

More Articles