Saturday, May 18, 2024

రీ-ఎంట్రీపై నాద‌ల్ క్లారిటీ.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్

spot_img

మాజీ వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 1 ర‌ఫెల్ నాద‌ల్ మళ్లీ రాకెట్ పట్టనున్నారు. భుజం గాయంతో ఈ ఏడాది ప‌లు టోర్నీల‌కు ఈ స్టార్ ఆట‌గాడు దూర‌మయ్యాడు. అయితే, ఆస్ట్రేలియా ఓపెన్ డైరెక్ట‌ర్ క్రెగ్ టిలే నాద‌ల్ రీ-ఎంట్రీ గురించి తాజాగా ఓ పోస్ట్ పెట్టాడు. వ‌చ్చే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నాద‌ల్ పోటీప‌డ‌తాడ‌ని క్రెగ్ అందులో చెప్పాడు.

Also Read.. వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ రోజున ఢిల్లీలో మ‌ద్యం అమ్మ‌కాలు బంద్ !

కాగా, ఆ పోస్ట్ కు నాద‌ల్ ఇన్‌స్టాగ్రామ్‌లో కౌంట‌ర్‌గా ఒక పోస్ట్ పెట్టాడు. ‘నేను మ‌ళ్లీ రాకెట్ ప‌డ‌తాన‌ని నిన్న‌నే చెప్పాను. నా టీమ్‌తో క‌లిసి ఎప్పుడు, ఎక్క‌డ ప్ర‌క‌ట‌న చేస్తానో అప్ప‌టివ‌ర‌కూ వేచి ఉండండి’ అని నాద‌ల్ రాసుకొచ్చాడు.

Also Read.. మంత్రి మల్లారెడ్డి అఫిడవిట్‌పై పిటిషన్‌.. కొట్టేసిన హైకోర్టు

ఈ స్పెయిన్ బుల్ ఇప్పటివరకు 22 గ్రాండ్‌స్లామ్స్‌ సాధించాడు. అయితే.. మోకాలు, భుజం గాయాల‌తో ర‌ఫా వెన‌క‌బ‌డ‌డంతో.. జకోవిచ్ దూసుకొచ్చాడు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గి 23 గ్రాండ్‌స్లామ్స్‌తో నాద‌ల్ రికార్డును బ‌ద్ధలు కొట్టాడు. త‌న రీ ఎంట్రీపై సోష‌ల్‌మీడియాలో వ‌స్తున్న తప్పుడు వార్త‌లపై తాజాగా ఆయన స్పందించారు.

Latest News

More Articles