Friday, May 17, 2024

దక్షిణాదిపై మోడీ ‘మెడి’ కుట్ర

spot_img

హైదరాబాద్‌: సామాన్యులకు అందుబాటులో నాణ్యమైన వైద్యం లేకుండా చేయాలని ప్రధాని మోడీ కొత్త కుట్రకు తెరలేపారు. ముఖ్యంగా తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలలో కొత్త మెడికల్‌ కాలేజీలు రాకుండా నిర్ణయాలు తీసుకుంటున్నది. తాజాగా కొత్త నిబంధనల పేరిట ఎంబీబీఎస్‌ సీట్లకు కత్తెర వేస్తూ నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) గత నెలలో జారీ చేసిన సర్క్యులర్ ఇప్పుడు వివాదం అవుతోంది.

Also Read.. మీరు ఫిట్టా.. గవర్నర్‌పై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం

ప్రతీ 10 లక్షల మంది జనాభాకు 100 ఎంబీబీఎస్‌ సీట్లు మాత్రమే ఉండేలా నిబంధనలు పాటించాలని ఆ సర్క్యులర్‌లో మోడీ సర్కార్ స్పష్టం చేసింది. ఒకవేళ ఈ నిబంధన గనుక అమలైతే దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడుకు తీవ్ర అన్యాయం జరగడం ఖాయం.  ఇప్పటికే కేంద్రం పెట్టిన పరిమితిని దాటి ఆయా రాష్ట్రాల్లో ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. ఈ నిబంధన అమల్లోకి వస్తే కొత్త కాలేజీల స్థాపన జరుగాలంటే కొన్ని దశాబ్ధాలు వేచిచూడాల్సిన దుస్థితి ఉంటుంది.దీంతోపాటు మెడికల్‌ కాలేజీల్లో అదనపు సీట్ల పెంపు కూడా కష్టమేనని వైద్యరంగంలోని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read.. ఇరాక్‌లో ఓ పెళ్లిలో భారీ అగ్నిప్రమాదం..100మంది మృతి, 150 మందికి పైగా గాయాలు..!!

కేంద్ర ఆరోగ్య సహాయమంత్రి డాక్టర్‌ భారతీ ప్రవీణ్‌ పవార్‌ ఇటీవల లోక్‌సభలో మాట్లాడుతూ.. ఎన్‌ఎంసీ నిబంధనలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో మెడికల్‌ సీట్లు ఎక్కువగా ఉన్నాయంటూ తన అక్కసును వెళ్లగక్కారు. ఈ క్రమంలోనే ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలను తీసుకురావడం గమనార్హం. జనాభా, సీట్ల నిష్పత్తి పేరిట.. యూపీ, బీహార్‌ వంటి రాష్ట్రాల్లో మెడికల్‌ సీట్లు తగిన పరిమితికి చేరుకునేవరకూ ఒకరకంగా మేలు చేసేందుకు పావులు కదుపుతున్నది. అయితే, వైద్యారోగ్యరంగం, మెడికల్‌ కాలేజీల ఏర్పాటు పూర్తిగా రాష్ట్రాల వ్యవహారమని, ఇందులో కేంద్రం ఏకపక్షంగా జోక్యం చేసుకోవడం సమాఖ్యస్ఫూర్తిని కాలరాయడమేనని నిపుణులు మండిపడుతున్నారు.

Also Read.. పెళ్లయిన స్త్రీలు ఈ తప్పులు చేస్తు…భర్త జీవితం నాశనం అవుతుందట..!!

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిబంధనల ప్రకారం.. ప్రతీ 1000 మంది జనాభాకు ఒక డాక్టర్‌ ఉండాలి. అయితే, భారత్‌లో ప్రతీ రెండు వేల మంది జనాభాకు ఒక డాక్టర్ కూడా లేడు. తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రతీ 500-800 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. అయితే, కేంద్రం తీసుకొచ్చిన ఏకపక్ష నిర్ణయంతో కొత్త మెడికల్‌ కాలేజీలు, తద్వారా సమాజంలోకి వైద్యుల రాక నెమ్మదించి, ఆరోగ్య సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

medical seates in south states

Latest News

More Articles