Friday, May 3, 2024

మీరు ఫిట్టా.. గవర్నర్‌పై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం

spot_img

హైదరాబాద్: మోదీ అప్రజస్వామిక విధానాలను అనుసరిస్తున్నట్టే.. ఆయన ఏజెంట్లయిన గవర్నర్లు అంతకంటే అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న దా సోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా నియమించకుండా గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఎలా తిరస్కరిస్తారని ప్రశ్నించారు. సర్కారియా కమిషన్‌ సిఫారసులను తుంగలో తొక్కి మీరు గవర్నర్‌ ఎలా అయ్యారని తమిళిసైని ప్రశ్నించారు.

Also Read.. 25వ వసంతంలోకి గూగుల్..సెర్చ్ ఇంజిన్ గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇవే..!!

గవర్నర్‌ పదవిని చేపట్టేనాటికి ఒ క్కరోజు ముందు కూడా రాజకీయాల్లో ఉన్న మీ రు అన్‌ఫిట్టా? అని నిలదీశారు. కాంగ్రెస్‌, బీజేపీకి ఒక విధానం, బీఆర్‌ఎస్‌కు మరో విధానమా? అని ధ్వజమెత్తారు. రాజ్యసభ సభ్యులుగా, ఆయా రాష్ట్రాల ఎమ్మెల్సీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు ఫిట్‌ అయినప్పుడు.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యమకారులైన బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారిని ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తే అన్‌ఫిట్ట్ ఎలా అవుతారని నిలదీశారు.

Also Read.. ఇరాక్‌లో ఓ పెళ్లిలో భారీ అగ్నిప్రమాదం..100మంది మృతి, 150 మందికి పైగా గాయాలు..!!

ఎమ్మెల్సీలుగా అర్జున అవార్డు గ్రహీతను చేయాల్సి ఉండేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన కామెంట్స్ పై మంత్రి స్పందించారు. అంబర్‌పేటలో వచ్చే ఎన్నికల్లో ఏ అర్జున అవార్డీని రంగంలోకి దింపుతారో వేచిచూద్దామని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.   వలసవాదానికి గుర్తుగా ఉన్న గవర్నర్ల వ్యవస్థ దేశానికి అవసరమా? అని మంత్రి కేటీఆర్‌ సూటిగా ప్రశ్నించారు. ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలని సూచించారు.

Also Read.. అవిసె గింజల రొట్టె తింటే…ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?

కేటీఆర్ చెప్పిన ఉదహరణలు

  • కాంగ్రెస్‌లో పనిచేసి బీజేపీలో చేరిన జ్యోతిరాధిత్యసింధియాను, రంజన్‌ గొగోయ్‌ని బీజేపీ రాజ్యసభకు నామినేట్‌ చేయలేదా?
  • యూపీలో బీజేపీ అధ్యక్షుడిగా చేసిన బ్రజ్‌ క్షేత్రాను ఎమ్మెల్సీగా నామినేట్‌ చేయలేదా?
  • గుజరాత్‌లో బీజేపీ నాయకుడు రాంసూరజ్‌ రాజధర్‌ అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోతే ఎమ్మెల్సీగా నామినేట్‌ కాలేదా?
  • యూపీలో ఆదిత్యనాథ్‌ తానా అంటే తం దానా అనే బీజేపీ నేత సాకేత్‌ మిశ్రాను ఎమ్మెల్సీగా నామినేట్‌ చేయలేదా?
  • బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు లాల్జీ నిర్మల్‌ ఎమ్మెల్సీ కాలేదా?
  • బీజేపీ వారణాసి అధ్యక్షుడు హన్స్‌రాజ్‌ ఎమ్మెల్సీగా నామినేట్‌ కాలేదా?
  • కర్ణాటక కాంగ్రెస్‌ క్యాంపెయిన్‌ కమిటీ చైర్మన్‌ ఎస్పీ సుధాందాస్‌, మరో కాంగ్రెస్‌ నేత సీతారాంను ఇటీవలే ఎమ్మెల్సీగా అక్క డి బీజేపీ గవర్నర్‌ ఎట్లా ఆమోదించారు?
  • కర్ణాటకలో ఉమాశ్రీని గవర్నర్‌ ఎలా నామినేట్‌ చేశారు? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Latest News

More Articles