Friday, May 3, 2024

వినాయకుడికి నైవేద్యంగా చికెన్, మటన్, ఫిష్!!

spot_img

ఎక్కడైనా సరే దేవుడికి ప్రసాదంగా పులిహోర, రవ్వ కేసరి, స్వీట్లు పెట్టడం చూస్తాం. కానీ అక్కడ మాత్రం దేవుడికి నైవేద్యంగా నాన్ వెజ్ పెడతారు. అయితే ఇది ఏ దేశంలోనో అనుకుంటే పొరపాటే. అది మనదేశంలోనే, మన పక్క రాష్ట్రం కర్నాటకలో ఇలా చేస్తున్నారు.

Read Also: ఏషియన్ గేమ్స్‎లో భారత్‎కు తొలి గోల్డ్ మెడల్

ఆల్కహాల్ కూడా..

ఉత్తర కర్ణాటకలోని కొప్పల్ జిల్లా భాగ్యనగర్ గ్రామంలో ఉన్న వినాయకుడి గుడిలో ఇలా నైవేద్యం పెడుతున్నారు. వినాయకుడి పూజలో అక్కడి ప్రజలు గణేశుడికి మాంసం, చేపలు, చికెన్ నైవేద్యంగా పెడతారట. సావాజీ కమ్యూనిటీ ఈ విశిష్టమైన ఆచారాన్ని నిర్వహిస్తోంది. గుడిలోనే ఇంట్లో గణేష్ నవరాత్రుల్లో రోజుకో వెరైటీ నాన్‌ వెజ్‌ వంటకాన్ని నైవేద్యంగా పెడుతామని అక్కడి వారు చెబుతున్నారు. నాన్ వెజ్ మాత్రమే కాదట.. ఆల్కహాల్ కూడా గణపతికి సమర్పిస్తామంటున్నారు. తరతరాలుగా ప్రతి ఏటా కొన్ని కుటుంబాలు కలిసి ఇలా మాంసాలను నైవేద్యంగా పెట్టడం ఒక ఆచారంగా నడుస్తోంది. మటన్‌ మసాలా, మటన్‌ బోటీ, మటన్‌ ఖీమా తదితర వంటకాలను అందిస్తారు. అలాగే కొంతమంది చేపలు, చికెన్‌ కూడా అందిస్తారు. చేపలలో మూరంగి చేప.. ఎలుకకు ఇష్టమైనదిగా చెబుతారు. రోటీ, ఎడ్మి మొదలైన వంటకాలను కూడా అందిస్తారు. ఈ విశిష్టమైన ఆచారం ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ వందల ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

అమెజాన్ ప్రైమ్‌ యూజర్లకు బిగ్ షాక్‌

విశేషమేంటంటే.. ఇక్కడి వారు భక్తిశ్రద్ధలతో శ్రావణ మాసాన్ని జరుపుకుంటారు. శ్రావణం మొదలు నుంచి గణేశ్‌ చతుర్థి వరకు నాన్‌ వెజ్‌ ముట్టుకోరు. గణేష్ చతుర్థి మొదటి రోజున మూషిక వాహనుడికి నాన్ వెజ్‌ వంటకాలను పెట్టి పూజలు ప్రారంభిస్తారు. అదేవిధంగా మొదటి రోజు విఘ్నేశ్వరునికి కడుబు, మోదక మొదలైన మధురమైన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అక్కడి నుంచి నవరాత్రులంతా నాన్ వెజ్ వంటకాలే గుడిలో నైవేద్యంగా ఉంటాయని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు..

తిరుమల వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్

Latest News

More Articles