Saturday, May 4, 2024

హైదరాబాద్ లో ఇల్లు కొన్న జాన్వీ

spot_img

బాలీవుడ్ సినీ నటి జాన్వీకపూర్.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. వ‌రుస సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల్లో ఫుల్ క్రేజ్ పెంచుకుంది. ప్ర‌స్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్నదేవ‌ర సినిమాతో సౌత్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. ‘దేవర’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన ఆమె నటిస్తోంది.

అయితే.. ఈ సినిమా షూటింగ్ కోసం ముంబై-హైదరాబాద్ మధ్య జర్నీ చేయడం జాన్వీకి ఇబ్బందిగా మారింది. దీంతో హైదరాబాద్ లోనే ఇల్లు కొన్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.3 కోట్ల విలువైన ప్లాట్ ఆమె కొన్నట్లు సమాచారం. త్వరలో హైదరాబాద్ కు జాన్వీ కపూర్ షిఫ్ట్ కానున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో కొద్దిరోజులు, ముంబైలో కొన్ని రోజులు ఉండేలా జాన్వీ ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: రూ. 2 వేల నోట్లపై ఆర్బీఐ మరో కీలక నిర్ణయం

Latest News

More Articles