Saturday, May 18, 2024

ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీం నోటీసులు!!

spot_img

సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలకు గాను సుప్రీంకోర్టు ఇవాళ(శుక్రవారం) తమిళనాడు ప్రభుత్వానికి, ఉదయనిధి స్టాలిన్‌కు నోటీసులిచ్చింది. సనాతన ధర్మం సమానత్వం, సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధమని, దానిని నిర్మూలించాల్సి ఉందని చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు నోటీసులిచ్చినట్లు సమాచారం. ఉదయనిధికి వ్యతిరేకంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ మద్రాస్‌కి చెందిన న్యాయవాది పిల్‌ ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

ఇటీవల తమిళనాడులో రచయితల సంఘం నిర్వహించిన సమావేశంలో ఉదయనిధి స్టాలిన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం కరోనా, డెంగ్యూ, మలేరియాలతో పోల్చారు. ఇటువంటి నమ్మకాలని వ్యతిరేకించే బదులు వాటిని పూర్తిగా నిర్మూలించాలని తెలిపారు ఉదయనిధి.

మరిన్ని వార్తలు..

Latest News

More Articles