Friday, May 3, 2024

ఫైనల్లో భారత్.. 7 వికెట్లతో చరిత్ర సృష్టించిన షమీ 

spot_img

ముంబై: వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 70 పరుగులతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మెగా టోర్నీలో ఫైనల్లో భారత్‌ అడుగుపెట్టింది. 398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. నాకౌట్‌ మ్యాచ్‌ల్లో కివీస్‌ను భారత్‌ ఓడించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ముంబైలో జరిగిన సెమీఫైనల్‌లో ఏడు వికెట్లు పడగొట్టిన మహమ్మద్ షమీ.. 2023 క్రికెట్ ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. అలాగే 57 పరుగులకు ఏడు వికెట్లు తీసి భారత అత్యుత్తమ వన్డే బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. మొత్తంగా ఈ ప్రపంచకప్‌లో కేవలం 6 మ్యాచ్‌లు ఆడిన షమీ.. 23 వికెట్లతో టాప్ ప్లేస్ లో నిలిచాడు. ఇక ఆడమ్ జంపా తొమ్మిది మ్యాచ్‌ల్లో 22 వికెట్లతో రెండో స్థానంలో ఉండగా, దిల్షాన్ మధుశంక తొమ్మిది మ్యాచ్‌ల్లో 21 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.

అదే విధంగా వన్డే వరల్డ్‌కప్‌ సింగిల్‌ ఎడిషన్‌లో అత్యధిక సార్లు ఫైవ్‌ వికెట్ల హాల్స్‌ సాధించిన బౌలర్‌గా షమీ నిలిచాడు. షమీ ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. ఈ రికార్డు ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాలేదు. ఓవరాల్‌గా వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీలో అత్యధిక ఫైవ్‌ వికెట్ల హాల్స్‌(4 సార్లు) నమోదు చేసిన బౌలర్‌గా షమీ నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌ పేరిట ఉండేది.

ఈ మ్యాచ్‌లో 9.5 ఓవర్లలో 57 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టిన షమీ.. అంతర్జాతీయ వన్డేల్లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు స్టువర్ట్‌ బిన్నీ పేరిట ఉండేది. 2014లో బిన్నీ బంగ్లాదేశ్‌పై 4 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో బిన్నీ ఆల్‌టైమ్‌ రికార్డును షమీ బ్రేక్‌ చేశాడు.

Latest News

More Articles