Sunday, May 12, 2024

ఆసియా కప్‌ విజేత భార‌త్.. ఫైనల్లో సూపర్ విక్టరీ

spot_img

Asia Cup 2023 : ఆసియా క‌ప్ ఫైన‌ల్లో భార‌త జ‌ట్టు డిఫెండింగ్ చాంపియ‌న్ శ్రీ‌లంక‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. ఎనిమిదోసారి ఆసియాకప్‌ను భారత్‌ గెలుచుకుని సత్తా చాటింది.

Also Read.. వీల్ చైర్ లో దేవెగౌడ.. కమిట్మెంట్ కి అఖిలపక్షం ఫిదా..!

కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో లంక‌పై 10 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక బ్యాటర్లకు హైదరాబాదీ బౌలర్‌ మహ్మద్ చుక్కలు చూపించాడు. ఆరు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. హార్దిక్ 3 వికెట్లు, బుమ్రా ఒక వికెట్ తీసారు.

Also Read.. ఎయిర్‌ఫోర్స్‌ విమానం కూలి.. బాలిక మృతి

15.2 ఓవర్లలో కేవలం 50 పరుగులకే ఆతిథ్య జ‌ట్టు కుప్పకూలింది.  51 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఇషాన్ కిషన్ 23, శుభ్మన్ గిల్ 27 పరుగులు చేయడంతో భారత్ 6.1 ఓవర్లలో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.

Latest News

More Articles