Saturday, May 4, 2024

టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్

spot_img

తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా ఆగస్టు 01న టెట్ నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ దరఖాస్తులను ఆగస్టు 2 నుంచి స్వీకరించగా.. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 16న ముగిసింది. దరఖాస్తు ముగిసే సమయానికి మొత్తం 2,83,620 అప్లికేషన్లు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. టెట్ పరీక్షను సెప్టెంబర్ 15వ తేదీన నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తుంది. ఇందులో భాగంగానే అధికారులు టెట్ హాల్ టికెట్స్ ని విడుదల చేశారు.

అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://tstet.cgg.gov.in/ ద్వారా తమ అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు అధికారులు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ సందర్శించి తమ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 15వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్షను అదేవిధంగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్ 2 పరీక్షను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 27న ఫలితాలను విడుదల చేస్తామని అధికారులు నోటిఫికేషన్ లో తెలిపారు.

Latest News

More Articles