Sunday, May 19, 2024

రోడ్డెక్కిన కోఠి మహిళ కళాశాల విద్యార్థినులు

spot_img

హైదరాబాద్ లో ని కోఠి ఉమెన్స్ కాలేజీ విద్యార్థినులు ఆందోళన బాటపట్టారు. కళాశాలలో సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పీజీ విద్యార్థినులు నిరసనకు దిగారు. ఈ మేరకు శనివారం కోఠి చౌరస్తాలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. తమ సమస్యలను పరిష్కరించాలని, పెంచిన ఫీజులను తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు.

కళాశాల యాజమాన్యం అటానమస్ సెమిస్టర్ కు గతంలో రూ. 3,500 ఫీజు ఉండేది. ప్రస్తుతం ఆ ఫీజునురూ. 5వేలుగా నిర్ణయించారు. దీంతో పేద విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ఫీజులను తగ్గించాలని హాస్టల్ లో సరైన వసతులను కల్పించాలని కళాశాల ప్రిన్సిపాల్ ను పలుమార్లు అడిగినా స్పందించలేదని లేవని మండిపడ్డారు. ప్రధానంగా హాస్టల్లో మంచినీటి వసతి, మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి: భువనగిరిలో విషాదం.. హస్టల్ గదిలో ఉరేసుకున్న 10వ తరగతి విద్యార్థినిలు..!!

Latest News

More Articles