Sunday, May 19, 2024

భువనగిరిలో విషాదం.. హస్టల్ గదిలో ఉరేసుకున్న 10వ తరగతి విద్యార్థినిలు..!!

spot_img

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం నెలకొంది. ఎస్సీ బాలికల హాస్టల్లో పదో తరగతి చదవుతున్న ఇద్దరు బాలికలు హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నారు. హైదరాబాద్ లోని హబ్సిగూడకు చెందిన బాలికలు హాస్టల్లో ఉంటూ పట్టణంలోని రెడ్డివాడ బాలికొన్నత పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతున్నారు. ఎప్పటిలాగే శనివారం కూడా స్కూల్ కు వెళ్లారు. సాయంత్రం హాస్టల్ కు తిరిగి వచ్చారు. తర్వాత హాస్టల్లో నిర్వహించే ట్యూషన్ కు వెళ్లలేదు.

ట్యూషన్ టీచర్ పిలవగా..తాము రాత్రి భోజనం చేశాక వస్తామని చెప్పి గదిలోనే ఉన్నారు. భోజనంసమయంలో వారు రాకపోవడంతో ఓ విద్యార్థి గది దగ్గరకు వెళ్లి చూడగా అప్పటికే ఇద్దరు రెండు ఫ్యాన్సలకు ఉరెసుకుని ఉన్నారు. వెంటనే 108 అంబులెన్సుకు సమాచారం అందించి జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. విద్యార్థినులను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు తెలిపారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. మేం వెళ్లిపోతున్నందుకు అందరూ మమ్మల్ని క్షమించండి. మేం తప్పు చేయకున్నా..అందరూ మమ్మల్ని అంటుంటే ఆ మాటలు తట్టుకోలేకపోతున్నాం. మమ్మల్ని మా శైలజ మేడం తప్పా ఎవరూ నమ్మలేదు.మా బాధ ఎవరికి చెప్పుకోలేక వెళ్లిపోతున్నాం అంటూ లేఖలో రాసి ఉంది. హాస్టల్ వార్డెన్ శైలజను, ట్యూషన్ టీచర్ ను పోలీసులు విచారిస్తున్నారు.

హాస్టల్లో విద్యార్థుల మధ్య జరిగిన గొడవ కారణంగా వీరు సూసైడ్ చేసుకున్నారని డీఈవో తెలిపారు. ఈ బాలికలు తమను దూషించి చేయి చేసుకున్నాంటూ నలుగురు విధ్యార్థులు పాఠశాలలో ఉపాధ్యాయురాలికి చెప్పడంతో వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. తమపై ఫిర్యాదు చేయడాన్ని అవమానంగా భావించిన బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

ఇది కూడా చదవండి: పేటీఎంను చుట్టుముట్టిన కష్టాలు..అసలేం జరిగింది.?

Latest News

More Articles