Monday, May 6, 2024

ఈ నెల మూడోవారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌.. కసరత్తు పూర్తిచేసిన ఎన్నికల కమిషన్‌

spot_img

ఈ నెల మూడోవారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రాబోతున్నది. ప్రస్తుత లోక్‌సభ బడ్జెట్‌ సమావేశాలు 8 లేదంటే 9న వాయిదాపడే అవకాశం ఉన్నది. ఆ వెంటనే షెడ్యూల్‌ ప్రకటన ఉంటుందని సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆ మేరకు కసరత్తు పూర్తిచేసిందని, కేంద్రం నుంచి సంకేతాలు అందగానే ప్రకటిస్తుందని చెప్తున్నారు.

Read Also: ఐటీలో జాబ్స్‌ కోత.. ఒక్క జనవరిలోనే 30 వేల మందిపై వేటు

నిజానికి ఈ నెల 18 లేదా 19నే షెడ్యూల్‌ విడుదలవుతుందని భావించారు. 2019లో ఏప్రిల్‌ 11 నుంచి మే 19 వరకు మొత్తం ఏడు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. మే 23న ఫలితాలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 24 తర్వాతే ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నా రు. 17వ లోక్‌సభ గడువు ముగిసేలోగానే 18 వ లోక్‌సభ ఎన్నికలు ముగించి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని అంచనా.

Latest News

More Articles