Friday, May 3, 2024

నేడు రవీంద్రభారతిలో తెలంగాణ సాహిత్య దినోత్సవం

spot_img

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రవీంద్రభారతిలో తెలంగాణ సాహిత్య దినోత్సవం, కవి సమ్మేళనం (ఉర్దూ, తెలుగు) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్ధిన్, ,గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, అధికార భాష సంఘం చైర్మన్ మంత్రి శ్రీదేవి, సంగీత నాటక అకాడమీ చైర్మన్ దీపికా రెడ్డి, ఆచార్య ఎన్ గోపి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రముఖ కవులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు రవీంద్రభారతిలో ఉర్దూ, తెలుగులో పద్య, వచన, ముషాయిరా నిర్వహిస్తున్నాం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. 33 జిల్లాల్లో కవి సమ్మేళనాలు జరిపి, రాష్ట్రస్థాయి అవార్డులు ఇస్తున్నాం. మనం మాట్లాడే భాషలో ఉర్దూ, తెలుగు రెండు మిక్స్ అయి ఉంటాయి. గంగా జమున తహెజీబ్ మన దగ్గర కనిపిస్తుంది. కవ్వాలి అంటే అందరికి నచ్చుతుంది. నాటి ప్రభుత్వాలు తమ రాజకీయ స్వార్థం కోసం మనల్ని వాడుకున్నాయి. కానీ నేడు అందరికి చదువు అందుబాటులో ఉండాలని గురుకుల రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి మంచి విద్య అందిస్తున్నాం. రవీంద్రభారతిలో మనకు ఏనాడు ముషాయిరా చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. నేడు కవులు, కళాకారులను సన్మానించి, వారిని మరింత ప్రోత్సహిస్తున్నాం’ అని మంత్రి తలసాని అన్నారు.

Latest News

More Articles