Sunday, May 19, 2024

రన్‌వేపై రెండు విమానాలు ఢీ

spot_img

టోక్యో: జపాన్‌ విమానాశ్రయంలో రన్‌వేపై రెండు విమానాలు ఢీకొన్నాయి. న్యూ చిటోస్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్యాథే పసిఫిక్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం రన్‌వేపై ఆగిఉన్న సమయంలో కొరియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్లేన్‌ దానిని ఢీకొట్టింది.

Also Read.. జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి

కొరియన్ సంస్థకు చెందిన విమానం టేకాఫ్ అయ్యే సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో 289 మంది ప్రయాణికులు, సిబ్బంది సదరు విమానంలో ఉన్నారు. అయితే, ఈ ఘటనలో మంటలు చెలరేగకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. మరోవైపు జపాన్‌లో పొగమంచు వల్ల విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

Also Read.. దళిత బంధును కాంగ్రెస్ కొనసాగిస్తుందా? లేదా? చెప్పాలి

జనవరి 2న టోక్యోలోని హనెడా విమానాశ్రయంలో రెండు విమానాలు ఢీకొట్టుకున్న ఘటన జరిగింది. హనెడా విమానాశ్రయంలో జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జేఏఎల్‌ 516 విమానం దిగుతున్న సమయంలో అక్కడే ఉన్న కోస్టు గార్డు విమానాన్ని ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్‌ విమానంలో మంటలు చెలరేగాయి. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ప్యాసింజర్‌ విమానంలోని 379 మంది ప్రయాణికులు, సిబ్బందిని రక్షించారు. కాగా, ఈ ప్రమాదంలో కోస్టుగార్డు విమానంలో ఉన్న అయిదుగురు సిబ్బంది మరణించారు.

Latest News

More Articles