Saturday, May 18, 2024

ఆసియా కప్ ఫైనల్‌లో వర్షం పడితే? కొలంబోలో వాతావరణం ఎలా ఉందంటే..?

spot_img

ఆసియా కప్ 2023 చివరి మ్యాచ్ సెప్టెంబర్ 17న భారత్, శ్రీలంక మధ్య జరగనుంది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. సూపర్ 4 రౌండ్‌లోని అన్ని మ్యాచ్‌లు ఈ స్టేడియంలోనే జరిగాయి. ఈ ఏడాది ఆసియా కప్‌లో వర్షం పాత్ర చాలా కీలకం. వర్షం కారణంగా టీమ్ మేనేజ్‌మెంట్, కెప్టెన్లు అనేక నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రిజర్వ్ డే రోజున ముగిసింది. అదే సమయంలో ఫైనల్ మ్యాచ్‌లో వరణుడు అంతరాయం కలిగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఫైనల్ మ్యాచ్‌లో వర్షం పడితే ఏమవుతుంది?

భారత్-శ్రీలంక మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తే, ఈ మ్యాచ్‌కి కూడా ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) రిజర్వ్ డేని ఉంచింది. ఈ నేపథ్యంలో.. వర్షం కారణంగా సెప్టెంబర్ 17న మ్యాచ్ పూర్తి కాకపోతే, సెప్టెంబర్ 18ని రిజర్వ్ డేగా ఉంచారు. అయితే వర్షం కారణంగా సెప్టెంబర్ 18న కూడా మ్యాచ్ పూర్తి కాకపోతే ఎలా? ఇదే జరిగితే రెండు జట్ల మధ్య ఆసియా కప్ టైటిల్ ఖాయం. గతంలో కూడా ఇలానే జరిగింది.

ఇది కూడా చదవండి: అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్ వీడియో వైరల్..డ్రోన్‎లతో ఉగ్రవాదులపై బాంబుల వర్షం..!!

2002 ఛాంపియన్స్ ట్రోఫీని శ్రీలంకలో నిర్వహించారు. ఆ ఏడాది కూడా టోర్నమెంట్ సెప్టెంబర్ నెలలోనే జరిగింది. చాలా మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించింది. ఫైనల్ మ్యాచ్ భారత్-శ్రీలంక మధ్య జరగాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ నిర్వహించలేక చివరకు రద్దయింది. ఆ తర్వాత భారత్, శ్రీలంకలు ఈ ట్రోఫీని తమలో తాము పంచుకున్నాయి. ఈసారి కూడా ఇవే రెండు జట్లు తలపడుతుండడంతో ఫైనల్ మ్యాచ్ రోజు వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంది. అటువంటి పరిస్థితిలో, సెప్టెంబర్ 17, 18 తేదీలలో కొలంబో వాతావరణం ఎలా ఉంటుందో ఓ పరిశీలిద్దాం.

ఇది కూడా చదవండి: రూ. 34 వేల ఫోన్ మీద రూ. 25 వేల డిస్కౌంట్

భారతదేశం వర్సెస్ శ్రీలంక ఫైనల్ మ్యాచ్ రోజున అంటే సెప్టెంబర్ 17న అక్యూవెదర్ నివేదిక ప్రకారం, వర్షం పడే అవకాశం 90% వరకు ఉంటుంది, రిజర్వ్ రోజున వర్షం సంభావ్యత 69%. అటువంటి పరిస్థితిలో, మ్యాచ్ రిజర్వ్ డే వరకు కొనసాగవచ్చు. సూపర్ 4లో కూడా అన్ని మ్యాచ్‌లలో వర్షం పడే అవకాశం 80% నుండి 90% వరకు ఉన్నప్పటికీ, అన్ని మ్యాచ్‌లు కంప్లీట్ గా ఆడారు. కొలంబో గ్రౌండ్ స్టాఫ్ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఈ మ్యాచ్ ఒకే రోజులో ముగుస్తుందని, తమ అభిమాన జట్టు ఈ టోర్నీని గెలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

మరిన్ని వార్తలు: 
ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జి.. తిరుమల ప్రయాణికులకు శుభవార్త

భారత్‌కు పెను ముప్పు.. సూపర్ బగ్స్‌తో వేలల్లో మరణాలు!

శ్రీవారి గర్భగుడిలో జరిగే సేవలు.. టికెట్ల బుకింగ్ ఎప్పుడంటే..

Latest News

More Articles