Friday, May 3, 2024

భారత్‌కు పెను ముప్పు.. సూపర్ బగ్స్‌తో వేలల్లో మరణాలు!!

spot_img

న్యూఢిల్లీ: సూపర్‌బగ్‌లు భారత్‌కు పెను ముప్పుగా మారాయి. ఈ మేరకు ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ) సూపర్‌బగ్స్‌ వల్ల జరిగే ఆరోగ్య, ఆర్థిక నష్టాలపై ఓఈసీడీ చేసిన అధ్యయన వివరాలను గురువారం విడుదల చేసింది.

ఇది కూడా చదవండి: సిరాజ్ దెబ్బకు శ్రీలంక విలవిల

సూపర్‌బగ్‌ ల కారణంగా ఏటా దేశంలో వేలల్లో మరణాలు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అదే సమయంలో వైద్య ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నదని తెలిపింది. భారత్‌తో పాటు గ్రీస్‌, తుర్కియే తదితర దేశాల్లో పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొంది.

ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్ల వల్ల దవాఖానలలో చేరుతున్న వారి సంఖ్య ఇటీవల క్రమంగా పెరుగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. సూపర్‌బగ్‌ కారణంగా 34 ఓఈసీడీ దేశాలతో పాటు ఈయూ దేశాల్లో ఏటా 79 వేల మంది మరణిస్తున్నట్టు నివేదికలో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: తుక్కుగూడ ఆరు గ్యారెంటీల తుక్కు రేగ్గొట్టిన గెల్లు

2035 నాటికి భారత్‌, గ్రీస్‌, టర్కీ తదితర దేశాల్లో నమోదయ్యే 40 శాతం ఇన్‌ఫెక్షన్లు యాంటీబయాటిక్‌ థెరపీ నుంచి తప్పించుకుంటాయని నివేదిక స్పష్టం చేసింది. సూపర్‌బగ్స్‌ విజృంభణతో రాబోయే రోజుల్లో న్యూమోనియా, రక్త ప్రవాహం ఇన్‌ఫెక్షన్‌ తదితర ప్రమాదకర రోగాలకు నివారణ లేకుండా పోతుందని హెచ్చరించింది.

 సూపర్‌బగ్స్ అంటే..

సూపర్‌బగ్స్‌ అనేవి ప్రమాదకరమైన సూక్ష్మజీవులు. బ్యాక్టీరియా, వైరస్‌, పరాన్నజీవులు, శిలీంద్రాలు తదితర సూక్ష్మజీవుల జాతులకు చెందినవి. ఇవి అనేక యాంటీబయాటిక్స్‌లకు నిరోధకత (రెసిస్టెంట్‌)ను కలిగి ఉంటాయి. అనేక ఇన్ఫెక్షన్లకు వాడే మందులు, చికిత్సలను ఇవి తట్టుకుంటాయి.

Latest News

More Articles