Thursday, May 9, 2024

తండాల తలరాతలు మార్చిన ఘనత కేసీఆర్‌దే.. ఓర్వలేకనే ప్రతిపక్షాలు కుట్రలు!

spot_img

వరంగల్ జిల్లా : బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తండాలకు మహర్దశ వచ్చిందని అన్ని రంగాల్లో అభివృద్ధికి కేసీఆర్ కృషి చేశారని పేర్కొన్నారు. సంగెం మండలంలోని పెద్దతండ గ్రామంలో శుక్రవారం ఉదయం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, డంపింగ్ యార్డ్, అంతర్గత సీసీ రోడ్లు ప్రారంభం చేశారు.

Also Read.. తిరుమల వెళ్లి వస్తుండగా అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తండాలను గ్రామపంచాయతీగా ఏర్పాటుచేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుందని అన్నారు. తండాలకు ప్రత్యేక నిధులతో తండాలకు, మండలాలకు అనుసంధానంగ ఉండే రహదారులు పునరుద్ధరణ చేసుకున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో రాష్ట్ర ప్రజలకు ప్రశాంతంగా ఉన్నారని పేర్కొన్నారు.

Also Read..పాక్‎ను చిత్తు చేసిన లంక..12వ సారి ఆసియా కప్ ఫైనల్‎కు శ్రీలంక..!!

బిఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. ఎవరని కుట్రలు చేసినా ప్రజల్లో ఉన్న ఆదరణతో కేసీఆర్  మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని,సిఎం కేసీఆర్ కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Also Read.. గణేషుడికి ఈ ప్రసాదాలు సమర్పిస్తే..వెంటనే ప్రసన్నమైపోతాడట..!!

బిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్లు అధికారులు ఉన్న రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలవుతున్న సంక్షేమ పథకాలు అమలు చేసి ఇక్కడ మాట్లాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సొసైటీ, మార్కెట్ చైర్మన్లు, కమిటీ సభ్యులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles