Sunday, May 19, 2024

జైలుకు వెళ్లేందుకు సిద్ధమా? కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల సవాల్

spot_img

హైదరాబాద్: సిద్దిపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడవేర్గు మంజుల రాజనర్సుపై అసంతృప్తి ఉందని వస్తున్న వార్తలను బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఖండించారు. సిద్దిపేట మున్సిపల్‌లో అవిశ్వాసం అనే మాటే లేదని, చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని స్పష్టం చేశారు. సిద్దిపేటలో ఎప్పటికీ ఎగిరేది గులాబీజెండానే అని బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు అన్నారు.

Also Read.. బిల్లులు అడ్డుకుంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఉపసర్పంచ్ ఆత్మహత్యాయత్నం

మున్సిపల్‌ చైర్మన్‌ అవినీతి చేశారని కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలపై చర్చకు సిద్ధమని, అవినీతి నిరూపించకుంటే జైలుకు వెళ్లేందుకు సిద్ధమా? అని సవాలు విసిరారు. కాంగ్రెస్‌ పార్టీ హామీలు సాధ్యం కాక ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేసిన తర్వాత మాట్లాడాలని సూచించారు. ఆరు గ్యారంటీలను అమలు చేసే వరకు మీవెంటే పడతామని.. ప్రజలకు అండగా నిలిచి పోరాటం చేస్తామని చెప్పారు.

Also Read.. ఫార్ములా -ఈ రేస్ రద్దు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తిరోగమన నిర్ణయం

శుక్రవారం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు సమిష్టి కృషికి నిదర్శనమని మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, కౌన్సిల్ సభ్యులు అన్నారు. అవార్డు రావడానికి కృషి చేసిన మాజీ మంత్రి హరీష్ రావుకి, భాగస్వామ్యం అయిన పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 11 ఢిల్లీలో మున్సిపల్ చైర్మన్ అవార్డు  అందుకుంటారని వారు చెప్పారు.

Latest News

More Articles