Saturday, May 18, 2024

ఫ్రాన్స్‌  స్కూల్‌లో కత్తితో రెచ్చిపోయిన ఉన్మాది

spot_img

పారిస్: ఫ్రాన్స్‌లోని ఒక స్కూల్‌లో ఓ వ్యక్తి కత్తితో రెచ్చిపోయాడు. ఈ సంఘటనలో ఒక ఉపాధ్యాయుడు మరణించగా పలువురు గాయపడ్డారు. ఫ్రాన్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ఫ్రాన్స్‌లోని అరాస్‌లో ఈ సంఘటన జరిగింది. గంబెట్టా హైస్కూల్‌లోకి ఒక వ్యక్తి చొరబడ్డాడు. స్కూల్‌ ప్రాంగణంలో ఉన్న టీచర్లు, సెక్యూరిటీ గార్డుపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.

Also Read.. ఈ ఎన్నికలు తెలంగాణకు గుజరాత్, ఢిల్లీ అహంకారానికి మధ్య పోటీ

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఒక ఉపాధ్యాయుడు మరణించగా.. మరో టీచర్‌, సెక్యూరిటీ గార్డు గాయపడ్డారు. విద్యార్థులు తలుపులు లాక్‌ చేసుకుని క్లాస్‌రూమ్స్‌లో ఉండిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి సదరు వ్యక్తిని అరెస్ట్‌ చేశారు.

Also Read.. తెలంగాణ డీఎస్సీ వాయిదా

నిందితుడు స్కూల్‌ పూర్వ విద్యార్థి అయిన 20 ఏళ్ల వ్యక్తి అని,అతనికి రాడికల్ ఇస్లామిజంతో సంబంధం ఉందని పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఇజ్రాయెల్‌-హమాస్ వివాదానికి, ఈ సంఘటనకు ఏదైనా సంబంధం ఉందా అన్నదానిపై స్పష్టత లేదని ఫ్రెంచ్ పోలీస్‌ అధికారులు తెలిపారు.

Latest News

More Articles