Saturday, May 4, 2024

18న గణేష్ పండుగ.. సెప్టెంబర్ 28న నిమజ్జనం.. ఏర్పాట్లపై కీలక సమీక్ష

spot_img

హైదరాబాద్: ఈ నెల 18వ తేదీన ప్రారంభమై సెప్టెంబర్ 28వ తేదీ వరకు కొనసాగే గణేష్ నిమజ్జనానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లపై ఈరోజు  సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన అన్ని మతాలకు చెందిన అన్ని పండుగలు, వేడుకలు ఇతర అన్ని కార్యక్రమాలు సాఫీగా జారిగాయన్నారు. ఈసారి గణేష్ నిమజ్జనం 28వ తేదీన వస్తుందని, 30 ఏళ్ల తర్వాత  మిలాద్ ఉన్ నబీ (28, 29వ తేదీన చంద్రుడు కనిపించే రోజున) ఒకే రోజున వచ్చే అవకాశం ఉన్నందున… వేడుకలను కూడా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా వేడుకలను ప్రశాంతమైన వాతవరణంలో జరుపుకోవాలన్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు సీపీ దిశా నిర్దేశం చేశారు.

Carona ప్రపంచవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగిస్తున్న ‘పిరోలాస’..!!

గణేష్ విగ్రహాల ప్రతిష్టాపన విషయంలో నిర్వాహకులతో, ఎన్ స్పెక్టర్లు ముందుగానే సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించాలన్నారు. గణేష్ వేడుకల్లో ఎక్కడా శాంతిభద్రతల్లో సమస్యని రానివ్వవద్దని, ఈ విషయంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.  గణేష్ నిమజ్జనం మొదలుకొని అంతా ముందుగా ప్రణాళిక ప్రకారం జరగాలని ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని ఆయన సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వదంతులను ప్రజలు నమ్మవద్దన్నారు. సోషల్ మీడియా తప్పుడు పోస్టులపై నిఘా ఉంచామని.. చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Latest News

More Articles