Saturday, May 18, 2024

పని చేసే నరేందర్ రెడ్డి ఉండగా.. ఫాల్తూ మాటలు మాట్లాడే రేవంత్ కావాలా?

spot_img

కొడంగల్: ఎన్నికలు రాగానే ఆగం చేసే వారు వస్తారు. ప్రజల మధ్యన ఉండే వారికి ఓటు వేస్తే కొడంగల్ అభివృద్ధి చెందుతదని సీఎం కేసీఆర్ అన్నారు. కొడంగల్ నియోజక వర్గం కోస్గి ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అభ్యర్థుల గుణాలను చూడటంతోపాటు వారి వెనుకున్న పార్టీల దృక్పదాన్ని మీరు చూడాలన్నారు. బిఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం అన్నారు. 15 సంవత్సరాలు పోరాడి టిఆర్ఎస్ తెలంగాణ సాధించింది. ఉన్న తెలంగాణ ను ఊడగొట్టిందే కాంగ్రెస్ అని విమర్శించారు.

Also Read.. కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్సీ కవిత

వర్షం మీద ఆధారపడి కొడంగల్  ఉండేది. రెండు వేల పెన్షన్ ను ఐదు వేలు చేస్తాము. సంక్షేమం ను మీరు చూసారు. 24 గంటలు కరెంటు ఇస్తున్నాము. రైతు బంధును పుట్టించిందే కేసీఆర్, బిఆర్ఎస్. రైతు బీమా ద్వారా ఐదు లక్షల రూపాయలను ఇస్తున్నాము. రైతు బంధుకు డబ్బులు ఇచ్చి కేసీఆర్ దుబారా చేస్తున్నాడు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. 24 గంటల కరెంట్ వేస్ట్.. మూడు గంటల కరెంట్ చాలు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. రైతు 10 HP మోటార్ పెట్టుకోవాలి అంటున్నాడు రేవంత్ రెడ్డి. 10 HP మోటార్ లు పెట్టాలి అంటే 50 వేల కోట్లు అవసరం అవుతాయన్నారు.

రేవంత్ పెద్ద భుకాబ్జాదారుడు. ధరణి తీసేస్తాము అంటున్నారు కాంగ్రెస్ వారు. భూమాత అని పేరు పెడతాము అంటున్నారు.. అది భూమాత నా..భూమేత నా అని అన్నారు. ధరణి తీసేస్తే రైతు బంధు ఎలా వస్తది. విఆర్ఏ మరియు విఆర్ఓ లను తీసుకొస్తామని అంటున్నారు. అది మనకు అవసరమా? ఆలోచించి ఓటు వేయాలన్నారు. రేవంత్ ఇక్కడ ఒక్క పని చేయలేదు. పని చేసే నరేందర్ రెడ్డి కావాలా.. ఫాల్తూ మాటలు మాట్లాడే రేవంత్ కావాలా? అని అడిగారు. ఇంతకన్నా ఘోరం ఉంటదా? రూ.50లక్షలు తీసుకొనిపోయి ఎమ్మెల్యేలను కొనాలని దొరికిపోతివి. మళ్లీ సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడితే ఎట్లా? ప్రజలు ఆలోచన చేయాలి.

Also Read.. నూకలు తినమన్న పార్టీకి నూకలు చెల్లేలా చేయాలి

ఎమ్మెల్యేలను కొనడానికి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వ్యక్తి రేవంత్. అది తనకు మెడల్ అంటున్నడు సిగ్గులేకుండా. నోటికి వచ్చినట్లు ముఖ్యమంత్రిపై మాటలు అంటున్నాడు. దీనిని రాజకీయం అంటారా? కాంగ్రెస్ లో 15 మంది మోపయిర్రు. నేను సిఎం అంటే నేను సిఎం అంటున్నారు. నరేందర్ రెడ్డి ని గెలిపియండి, ఆయనకు ప్రమోషన్ వస్తది అని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇంతకు ముందు మంచి నీటికి ఘోస ఉండేది, కానీ నేడు అది లేదు. కంటి వెలుగు అనేది దేశంలో ఎవరైనా చేశారా? మూడు కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించామమన్నారు.

Also Read.. కాంగ్రెస్ అంటేనే దళారీల రాజ్యం

కొడంగల్ లో ఇరగదీసాడని తన మీద పోటీకి కామారెడ్డికి వచ్చిండు రేవంత్ రెడ్డి. కామారెడ్డిలో అంగి ఊడేదాక కొడతారు. కొడంగల్ లో లాగు ఊడే దాక కొట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. దొఖే బాజ్ పార్టీ కాంగ్రెస్. ఎన్నికల తర్వాత కొడంగల్ కు ఒకరోజు వచ్చి రోజంతా ఉంటా..ఎన్ని కోట్లు అడిగినా నిధులు ఇస్తా. కొడంగల్ అభివృద్ధి బాధ్యత తనదన్నారు. ఏడాది లోపల పాలమూరు రంగారెడ్డి ద్వారా నీరు అందుతదని సీఎం తెలిపారు.  ఈ సభలో రాజ్యసభ సభ్యులు కేశవరావు, బీఆర్ఎస్ అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి, మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.

Latest News

More Articles