Friday, May 17, 2024

సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి

spot_img

హైదరాబాద్: రైతు భరోసా ప్రారంభించామని పచ్చి అబద్ధాలు చెప్పినందుకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి దావోస్ వెళ్లి ప్రపంచ వేదిక పైన పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. అసలు ప్రారంభమే కానీ రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు డబ్బులు ఇస్తున్నట్లు చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికల పైన రేవంత్ రైతు భరోసా పేరుతో అబద్ధాలు చెపుతుంటే… ఇక్కడ రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామని మంత్రులు అంటున్నారని ఫైర్ అయ్యారు. గురువారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

Also Read.. మైనంపల్లి హనుమంత రావుపై చర్యలు తీసుకోండి: లోకాయుక్త

‘‘అంతర్జాతీయ వేదికల పైన అబద్ధం చెప్పినట్టు రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి. ఉన్న రైతుబంధు ఇవ్వని రేవంత్ రెడ్డి..లేని రైతు భరోసా గురించి మాట్లాడడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే. రేవంత్ రెడ్డి 45 రోజుల్లో సాధించింది కేవలం ఢిల్లీ పర్యటనలు చేయడం మాత్రమే. తెలంగాణ పరిపాలన ఢిల్లీ నుంచి జరుగుతుందని ముందే చెప్పినం ప్రస్తుతం అదే జరుగుతుంది. రాష్ట్రం దివాలా తీసిందని చెబుతూనే.. ముఖ్యమంత్రికి కొత్త క్యాంపు కార్యాలయం ఎందుకు కడుతున్నారు. ఉన్న క్యాంపు కార్యాలయాన్ని పక్కనపెట్టి కొత్త క్యాంపు కార్యాలయం ఎందుకో ప్రజలకు చెప్పాలి. కేవలం భేషజాల వల్లనే రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ వాడలేదు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా కొత్తవి కట్టుకుంటాపోతే ఎట్లా?

Also Read.. ఫిబ్ర‌వ‌రి 8న ఫైన‌ల్ ఓటర్ల జాబితా విడుద‌ల చేస్తాం

అవసరం లేని భవనాలు కట్టడానికి రేవంత్ రెడ్డికి డబ్బులు వస్తున్నాయి కానీ రైతుబంధుకు నిధులు వేయడానికి రావట్లేదు. ఒకప్పుడు ప్రభుత్వ సలహాదారులు వద్దు అంటూ.. గతంలో కోర్టులో కేసు వేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రాజకీయ నిరుద్యోగులను సలహాదారులుగా నియమించుకుంటున్నారు. ప్రభుత్వాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనపైన ఉపముఖ్యమంత్రి బట్టి మాటల దాడి చేశారు. తాజాగా బట్టి ఒక సమావేశంలో ఇదే తీరుగా మాట్లాడారు. అంతర్జాతీయ సంస్థలు, మల్టి నేషనల్ కంపెనీల వలన సామాజిక న్యాయం, సమానత్వం, ఉద్యోగ, ఉపాధి కల్పన భూతద్దం వెతికి చూసిన కనిపించవు అంటూ ఉపముఖ్యమంత్రి బట్టి ఒకవైపు మాట్లాడుతుంటే.. ముఖ్యమంత్రి మాత్రం ఆదే అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాల కుదురుచుకుంటున్నారు. మరి బట్టి విక్రమార్క.. MNC కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న రేవంత్ రెడ్డిపైన మాట్లాడుతున్నారా.. బట్టి చెప్పాలె.

Also Read.. జీవన్ రెడ్డి.. కక్ష సాధింపు వద్దు, ప్రజల కోసం పనిచేయండి

బట్టి విక్రమార్క వ్యాఖ్యలు చూస్తుంటే రేవంత్ రెడ్డి దావోస్ ఎందుకు పోయిండ్రో చెప్పాలని ప్రశ్నించినట్లు ఉంది. ఇది ముఖ్యమంత్రి దావోస్ పర్యటనపైన ఉప ముఖ్యమంత్రి బట్టి చేసిన మాటల దాడి లెక్క ఉంది. పది సంవత్సరాలపాటు అదానీని రాష్ట్రానికి వస్తామన్న రానివ్వలేదు. ఆదానీ పెట్టుబడులు మోడీకే లాభం అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఈరోజు ఒప్పందం ఎలా చేసుకున్నారో చెప్పాలి. ఒకవైపు రాహుల్ గాంధీ, అదానీని తిడుతుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం ఆయనతో ఒప్పందం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమంత్రిని ఐదు సంవత్సరాలు కొనసాగించిన చరిత్ర లేదు.

Also Read.. ఓటుకు నోటు దోంగ సీఎం అయితే ఇలానే ఉంటుంది.. మండిపడుతున్న విద్యార్థులు

ఒకాయన నేనే నెంబర్ 2 అంటాడు. ఉప ముఖ్యమంత్రి భార్య మాత్రం మిగతా లీడర్లని పారాషూట్ లీడర్లు అంటుంది. ఇంకోయాన నా మాటనే చెల్లుతుంది అంటారు… ఇట్లా అనేక వైరుధ్యాల మధ్యన ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎన్ని రకాల దృష్టి మరలచే ప్రయత్నాలు చేసినా 420 హామీల అమలు చేసేలా వెంటాడుతాం. గతంలో నేను దావొస్ పోయినప్పుడు స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకున్నామంటూ విమర్శలు చేశారు. మరి గతంలో మాట్లాడిన ఉత్తంకుమార్ రెడ్డి లాంటోళ్లు దావొస్ బోగస్ అనే విషయం పైన ఇప్పుడు మాట్లాడాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Latest News

More Articles