Monday, May 6, 2024

రెచ్చిపోయిన లవర్స్.. కారులో న‌గ్నంగా రొమాన్స్

spot_img

వారిద్దరూ లవర్స్.. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని ఊరంతా తిరుగుతున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ ముద్దు పెట్టుకోవాలనుకున్నారు. ఇంకేముంది.. ఎక్కడ ఉన్నాం అనేది కూడా చూడకుండా.. కారులోనే బరితెగించారు. ఈ ఘ‌ట‌న బెంగ‌ళూరులోని జ‌న‌భార‌తి పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో గురువారం చోటు చేసుకుంది. లవర్స్ తమ కారును ఓ పార్కు స‌మీపంలో ఆపి.. న‌గ్నంగా మారిపోయారు. ముద్దులు, కౌగిలింత‌ల‌తో రొమాన్స్‌లో మునిగిపోయారు. అయితే కారులో ఉన్న ఆ జంట‌ను స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ గ‌మ‌నించి, ద‌గ్గ‌రికి వెళ్లాడు. భయాందోళ‌న‌కు గురైన ఆ జంట.. ఎస్ఐను గుద్దుకుంటూ కారును వేగంగా పోనిచ్చారు. తీవ్ర గాయాల‌పాలైన ఎస్ఐ మ‌హేశ్ ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘ‌ట‌న‌పై జ‌న‌భార‌తి పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. సీసీ ఫుటేజీ ద్వారా కారును గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

Read Also: షాకింగ్ వీడియో.. వృద్ధుడిని కొమ్ములతో పొడిచి చంపిన ఎద్దు

Latest News

More Articles