Sunday, April 28, 2024

త్వరలో 30వేల మంది సోషల్ మీడియా వారియర్స్ తో భారీ సమావేశం

spot_img

పార్లమెంట్ స్థానాల వారీగా సన్నాహక సమావేశాలను విజయవంతంగా పూర్తి చేసుకున్నాం అని అన్నారు కేటీఆర్. తాజాగా మీడియాతో కేటీఆర్ తెలంగాణ భవన్ లో చిట్ చాట్ చేశారు. ‘ ప్రతిరోజు 10 అసెంబ్లీ నియోజకవర్గం చొప్పున పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశాలు నిర్వహించబోతున్నాం. త్వరలో 30,000 మంది సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశాలు జరపబోతున్నాం. కిందటి ఎన్నికల్లో 14 అసెంబ్లీ స్థానాలను స్వల్ప ఓట్ల తేడాతో కోల్పోయాం. మొన్న జరిగిన పార్లమెంటు సన్నాక సమావేశంలో మంచి ఫీడ్ బ్యాక్ కార్యకర్తల నుంచి వచ్చింది. పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి సూచనలు ఇచ్చారు. గతంలో జరిగిన కార్యక్రమాలపైన కూడా విమర్శనాత్మకమైన ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా క్షేత్రస్థాయి నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది.

కొత్త ప్రభుత్వం పైన స్వల్ప కాలంలోనే పలు వర్గాల నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలన్న వాళ్ళకి, ప్రతిపక్షాలు చెప్పే మాటలు వినే సహనం కూడా ఉండాలి. రైతుబంధు అడిగితే చెప్పుతో కొట్టాలన్నటువంటి మాటలు ప్రజలను మనసులు గాయపరుస్తాయి. ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చేందుకు చెప్పిన మాటలను… ప్రధాన ప్రతిపక్షంగా గుర్తుచేస్తున్నాం. ఈ రోజుకు కూడా రెండు ఎకరాలకు మించి రైతుబంధు పడడం లేదు. 9 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న వారికి పార్టీ తరఫున ఆదుకుంటాం. రాష్ట్రంలో ఉన్న లక్షల మంది ఆటో డ్రైవర్ల సమస్యల పైన పార్టీ తరఫున మాట్లాడదాం. వారి సమస్యలపైన ప్రధాన ప్రతిపక్షంగా గొంతు విప్పుతాం. ఇంత స్వల్పకాలంలో అనేక వర్గాలను దూరం చేసుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు కేటీఆర్.

Latest News

More Articles