Friday, May 17, 2024

మోడల్‌ దివ్య పోస్ట్‌మార్టం నివేదికలో కీలక విషయాలు

spot_img

న్యూఢిల్లీ: గురుగ్రామ్‌లోని హోటల్‌లో హత్యకు గురైన మోడల్‌ దివ్వ పాహుజా పోస్ట్‌మార్టం నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. నిందితులు ఆమెను పాయింట్‌ బ్లాంక్‌ రేంజిలో కాల్చినట్లు గుర్తించారు. ఇటీవల హరియాణాలోని కాలువలో దొరికిన ఆమె మృతదేహానికి హిస్సార్‌లోని మెడికల్‌ కళాశాలలో పోస్ట్‌మార్టం నిర్వహించారు.

Also Read.. సంగారెడ్డి జిల్లాలో పండుగ పూట విషాదం

గ్యాంగ్‌స్టర్‌ సందీప్‌ గడోలీ నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో మాజీ మోడల్‌ దివ్య పాహుజా నిందితురాలిగా ఉన్నది. జనవరి 2న గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో ఆమెను కాల్చి చంపారు. అనంతరం దివ్య శవాన్ని పంజాబ్‌లోని భాఖ్‌డా కెనాల్‌లో పడేశారు. ఈ కేసులో హోటల్‌ యజమాని అభిజీత్‌ సింగ్‌తో పాటు ఇద్దరు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు.

Also Read.. కోడి పందాలపై పోలీసుల మెరుపు దాడులు

2016లో ముంబయిలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో సందీప్‌ మరణించాడు. అయితే అది నకిలీ ఎన్‌కౌంటర్‌ అని ఆ తర్వాత తేలింది. హరియాణా పోలీసులతో కుమ్మక్కై.. సందీప్‌ ప్రత్యర్థి బిందర్‌ గుజ్జర్‌ అనే గ్యాంగ్‌స్టర్‌ ఇది చేయించాడని విచారణలో గుర్తించారు. బిందర్‌ కుట్రలో భాగంగానే సందీప్‌ను మోడల్‌ దివ్య అక్కడికి తీసుకొచ్చినట్లు తేల్చారు.ఈ కేసులో ఆమె ఏడేళ్లు జైలు శిక్ష కూడా అనుభవించింది.

Latest News

More Articles