Saturday, May 4, 2024

బిహార్‌లో అధికారం కోసం లాలూ తీవ్ర ప్రయత్నాలు!

spot_img

బీహార్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. జేడీయూ పార్టీ(నితీష్ కుమార్), ఆర్జేడీ పార్టీ(లాలూ ప్రసాద్ యాదవ్)తో బంధం ముగిసింది. ఈ నేపథ్యంలో మరోసారి నితీష్ కుమార్ మరోసారి బీజేపీ సాయంతో అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు లాలూ కూడా అధికారం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

అధికారంలోకి రావాలంటే 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలన్నింటికి కలిపితే.. మరో 8 మంది ఎమ్మెల్యేలు తక్కువ అవుతున్నారు. దీంతో ఇతర పార్టీలు, ఇండిపెండెట్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్డీయేలో ఉన్న మాజీ బీహార్ సీఎం జితన్ రామ్ మాంఝీ కుమారులకు లోక్‌సభ స్థానాలతో పాటు డిప్యూటీ సీఎం పదవులను కూడా లాలూ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

బిహార్ మొత్తం 243 అసెంబ్లీ సీట్లు ఉండగా.. ఆర్జేడీ-79, బీజేపీ-78, జేడీయూ-45, కాంగ్రెస్-19, వామపక్షాలు-16, హెచ్ఏఎం(ఎస్)-4, ఎంఐఎం-1, ఇండిపెండెంట్-1 ఉన్నారు. పరిస్థితులను బట్టి లాలూ కూటమికి మ్యాజిగ్ ఫిగర్ దాటడం కష్టమే. అయితే, అధికారం కోసం లాలూ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Also Read.. బీజేపీ పార్టీ ప్రతినిధిలా తమిళిసై వ్యాఖ్యలు.. కడియం, పల్లా ఫైర్

Latest News

More Articles