Friday, May 3, 2024

కాంగ్రెస్ లో 100 టికెట్లు.. 101 ధర్నాలు

spot_img

జనగామ జిల్లా : స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్, గులాబీ జెండాకు కంచుకోట అని, కార్యకర్తలంతా కలిసి పనిచేసి అత్యధిక మెజారిటీతో కడియం శ్రీహరిని గెలిపించాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. శనివారం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఆత్మీయ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లిదయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, రైతు బంధు సమితి చైర్మన్, ఎమ్మెల్యే రాజయ్య, జనగామ జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, జీడబ్ల్యుఎంసీ మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

Also Read.. గాంధీభవన్ ముందు కాంగ్రెస్ జెండాలు తగులబెట్టి నిరసన

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తనకు సిద్దిపేట తర్వాత ఎంతో ఇష్టమైన నియోజకవర్గం స్టేషన్ ఘనపూర్ అని చెప్పారు. ఉద్యమ సమయంలో ఇక్కడి కార్యకర్తలతో రాత్రి పగలు కలిసి పనిచేసినట్లు పేర్కొన్నారు.  కాంగ్రెస్ లో 100 టికెట్లు.. 101 ధర్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ తెలంగాణ ద్రోహులు, అవినీతిపరుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. పీసీసీ అధ్యక్ష పదవి కోసం రేవంత్ రెడ్డి 50 కోట్లు ఇచ్చాడని కోమటిరెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ ఎవరికి ఇచ్చారో ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలి.. చర్యలు తీసుకోలేదంటే డబ్బులు ఇచ్చింది నిజమేనని అర్థమవుతుందన్నారు.

Also Read.. 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్.. ఎన్నడూ రైతుల గురించి ఆలోచించలేదు

కాంగ్రెస్ టికెట్లను రూ. 5 కోట్లు, 10 ఎకరాల భూమికి అమ్ముకుంటున్నారని ఆ పార్టీ నేతలే అంటున్నారు. కాంగ్రెస్ కు సగం సీట్లలో అభ్యర్థులు లేరు.. పక్క పార్టీల వైపు చూస్తున్నారు. సొంత నియోజకవర్గాల్లో గెలవలేని కొంత మంది కాంగ్రెస్ నేతలు కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్లలో పోటీ చేస్తాం అంటున్నారు. మీ ఊరిలోనే గెలవలేదు కానీ.. సీఎం కేసిఆర్ పైన పోటీ చేస్తారా? ప్రజలకు కేసిఆర్ అంటే ఒక విశ్వాసం. మోసానికి మారుపేరు కాంగ్రెస్ అని పేర్కొన్నారు.

2009లో పగటిపూట 9 గంటలు కరెంట్ ఇస్తామని 3 గంటలు కూడా ఇవ్వలేదు.. తండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని చేయలేదు. కాంగ్రెస్ వాళ్లకు మాటలు ఎక్కువ చేతలు తక్కువ. సీఎం కేసిఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారు. తెలంగాణాను సీఎం కేసీఆర్ కోటి ఎకరాల మాగాణ చేశారని గుర్తుచేశారు.

Also Read.. బీజేపీకి బాబూమోహన్‌ రాజీనామా!

కేసిఆర్ భరోసా పేరిట మన మెనిఫెస్టో ఉంది. ప్రతి గడప గడపకు తీసుకువెళ్ళాలి. రైతు బంధు సృష్టికర్త కేసీఆర్, రైతుకే డబ్బు ఇచ్చిన ఒకే ఒక్కడు కేసీఆర్. ఎకరాకు 10 వేలు ఇచ్చాడు, 16 వేలు పెంచ బోతున్నం. పింఛన్లు 5 వేలు పెంచబోతున్నాం. 400 లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాము. సౌభాగ్య లక్ష్మి ద్వారా మహిళలకు 3 వేలు ఇవ్వబోతున్నాము. రేషన్ కార్డులు ఉన్న వాళ్లకు 6 కిలోల సన్నబియ్యం ఇవ్వబోతున్నాము. ఏటా 1300 కోట్లు ఎక్కువ ఖర్చు అవుతున్నా సీఎం లెక్క చేయడం లేదు. గురుకులాల్లో ఇప్పటికే సన్నబియ్యం ఇస్తున్నం. ఇకనుండి పెద్దలకు కూడా సన్నబియ్యం అందంచబోతున్నం. రైతు బీమా లాగానే, 5 లక్షల బీమా కోటి కుటుంబాలకు చెయ్యబోతున్నము. బిఆర్ఎస్ గెలిచాక ఆసరా పింఛన్లు 5వేలు చేయబోతున్నాం. ఆసైండ్ ల్యాండ్స్ కి పూర్తి హక్కులు ఇవ్వ బోతున్నం. ఆరోగ్య శ్రీ ద్వారా 15 లక్షల చికిత్స ఉచితంగా అందించబోతున్నామని తెలిపారు. స్టేషన్ ఘన్ పూర్ నిండు కుండ లాగా మార్చింది సీఎం కేసీఆర్. మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది కేసీఆర్. కడియం శ్రీహరి మంచి నాయకులు. రాజన్న, శ్రీహరి కలిసి ఈ నియోజకవర్గం అభివృద్ధి చేస్తారు. మంచి మెజారిటీతో గెలిపించాలని మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు.

Latest News

More Articles