Friday, May 3, 2024

తక్కువ సమయంలో 21 మెడికల్ కాలేజీలు.. దేశంలోనే రికార్డు

spot_img

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ లక్ష్యంగా సాగుతున్నామని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు. 60 ఏళ్లలో 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, 9 ఏళ్లలో 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందన్నారు. అతి తక్కువ సమయంలో మొత్తం 21 మెడికల్ కాలేజీలు ప్రారంభించి తెలంగాణ దేశంలో రికార్డు సృష్టించింది అన్నారు.

పెద్ద మొత్తంలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ, వైద్య సిబ్బందిని నియమిస్తూ ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేసినట్లు చెప్పారు. ఇటీవల ఏక కాలంలో 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియమించడం వల్ల టీచింగ్ ఆసుపత్రులు మరింత బలోపేతమై అయినట్లు చెప్పారు.

సోమవారం టీచింగ్ ఆసుపత్రుల నెలవారీ సమీక్ష నిర్వహించారు. సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, డిఎంఇ రమేష్ రెడ్డి, అరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.

‘‘ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందెందుకు, ప్రభుత్వం తరఫునుంచి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మీ వంతుగా ప్రతి ఒక్కరు బాగా పని చేయాలనీ కోరుతున్నాను. కొద్ది కాలం నుండి మనందరం చేస్తున్న కృషి వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఘనంగా ప్రకారం మాతృ మరణాల రేటు రాష్ట్రంలో ఘనంగా తగ్గింది. తెలంగాణ ఏర్పడినాడు 92 గా ఉంటే ఇప్పుడు 43 కు తగ్గించగలిగాము.

ఆరోగ్య రంగంలో తెలంగాణ నెంబర్ 1 గా నిలవాలి. యాంటి ర్యాగింగ్ గురించి కాలేజీలో ప్రచారం చేయండి. ర్యాగింగ్ వంటివి సహించము. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి. ఉదయం 9 గంటల వరకు ప్రతి ఒక్కరూ విధుల్లో ఉండాలి. కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ ప్రొఫెసర్లు వైద్యంతో పాటు బోధన పరిశోధనపై దృష్టి సారించాలి.’’ అని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.

 

Latest News

More Articles